సోనూసూద్.. సిల్వర్ స్క్రీన్ పై ఎక్కువగా విలన్ పాత్రలు పోషించినా నిజ జీవితంలో రియల్ హీరో అనిపించుకున్నారు సోనూసూద్. కరోనా సమయంలోనూ, లాక్‌డౌన్ టైంలోనూ ఎంతో మందికి ఆపన్న హస్తం అందించారాయన. ఇప్పటికీ తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడీ హ్యాండ్సమ్ యాక్టర్. చిన్నారులకు గుండె తదితర ఆపరేషన్లు చేయించి వారి తల్లిదండ్రుల కళ్లల్లో వెలుగులు నింపుతున్నాడు. ఇక కొద్దిరోజుల క్రితం బిహార్‌లోని అనాథ, పేద పిల్లల కోసం ఓ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్‌ను కూడా నిర్మిస్తున్నట్లు తెలిపాడు. ఇలా సినిమాలు, టీవీ షోల్లో పాల్గొంటూనే తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు సోనూసూద్. సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటూ ఆపదలో ఉన్నవారికి తనకు చేతనైన సహాయం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఎంటీవీ రోడీస్ సీజన్ 19 షూటింగ్‌లో బిజీగా ఉంటున్నారు. కాగా ఇదే ప్రాజెక్టులో బాలీవుడ్ హీరోయిన్, దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కూడా ఉంది. ప్రస్తుతం ఈ టీవీ షో షూటింగ్ హిమాచల్ ప్రదేశ్‌లో జరుగుతోంది. ఈక్రమంలో సెట్‌లో ఉన్న వారందరి కోసం సరదాగా దోసెలు వేశారు సోనూసూద్. ఎవరికి ఎలాంటి దోసెలు కావాలో అడిగి మరీ రెడీ చేశారు సోనూసూద్.
ఇదే సమయంలో హీరోయిన్ రియా అక్కడకు వచ్చింది. దీంతో ఆమె కోసం కూడా బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసి ఇచ్చారు సోనూసూద్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. సోనూ సూద్ సింప్లిసిటీని చూసి ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. మీపై మరెంతో గౌరవం పెరిగిందంటూ కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో సుశాంత్ ఫ్యాన్స్ మాత్రం కొంతమేర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రియాకు దూరంగా ఉండాలంటూ సోనూకు సూచిస్తున్నారు. కాగా సుశాంత్ సూసైడ్ కేసులో రియాపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. కొంత కాలం పాటు జైలులో కూడా ఉన్నారామె. ఈ కారణంగానే రియాకు దూరంగా ఉండాలంటూ సోనూను కోరారు ఫ్యాన్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.