Shilpa Shetty: ఇంకా జైల్లోనే భర్త రాజ్ కుంద్రా.. కెమెరా ముందుకొచ్చిన శిల్పా శెట్టి

బాలీవుడ్‌‌‌లో సంచలనం రేపిన శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా వ్యవహారం ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే కొనసాగుతుంది. రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత అతడి చీకటి

Shilpa Shetty: ఇంకా జైల్లోనే భర్త రాజ్ కుంద్రా.. కెమెరా ముందుకొచ్చిన శిల్పా శెట్టి

Updated on: Aug 19, 2021 | 2:52 PM

Shilpa Shetty: బాలీవుడ్‌‌‌లో సంచలనం రేపిన శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా వ్యవహారం ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే కొనసాగుతుంది. రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత అతడి చీకటి వ్యవహారాలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. కొంతమంది మోడల్స్ బయటకు వచ్చి అతడిపై సంచలన ఆరోపణలు కూడా చేశారు. గత ఏడాది ఇది ఫిబ్రవరి 4వ తేదీన మహిళలను బలవంతంగా శృంగార సినిమాల్లోకి నెట్టిన ఆరోపణలపై ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో విచారణ ప్రారంభించిన మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులకు పోర్న్ చిత్రాల వ్యాపార రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. బ్రిటన్ వేదికగా నడుస్తున్న యుకె ప్రొడక్షన్ యజమాని ఉమేష్ కామత్‌తో రాజ్ కుంద్రాకు సంబంధాలున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సినిమాల్లో అవకాశం కోసం వచ్చే అమ్మాయిలను అవకాశాల పేరుతో ఈ ఊబిలోకి దించుతున్నారని పోలీసులు తెలిపారు. ఇక భర్త అరెస్ట్‌‌తో శిల్ప శెట్టి‌కి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఆమె సినిమాలకు గ్యాప్ ఇచ్చి టీవీషోలకు జెడ్జ్‌‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత ఆమె షోలను వదిలిపెట్టింది. అలాగే తాను బ్రాండ్ అంబాసిడర్‌‌గా ఉన్న పలు ఉత్పతుల నుంచి కూడా ఆమె తప్పుకుందని వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఇక పై శిల్ప శెట్టి కనిపించక పోవచ్చు అంటూ కొంతమంది అభిప్రాయం పడ్డారు కూడా కానీ భర్త అరెస్ట్ తర్వాత సోషల్ మీడియాలో కనిపించి షాక్ ఇచ్చారు శిల్పా. అలాగే  తాను ఒకప్పుడు టీవీ షోల్లో జడ్జిగా ఉన్న పోస్టుకే మళ్లీ వచ్చింది. ఓ ప్రముఖ ఛానెల్లో ప్రసారమవుతున్నా ‘సూపర్ డాన్సర్-4’కు జడ్జిగా శిల్పా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షో అంత పాపులర్ అవ్వడానికి శిల్పా పాత్రకూడా ఉంది.  దీంతో షో నిర్వాహకులు శిల్పాశెట్టి పోస్టును అలాగే ఉంచారు. ఇక శిల్పాశెట్టి సెట్‌లోకి తిరిగి అడుగు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. భర్త జైల్లో ఉంటే శిల్పా ఇలా కెమెరా ముందుకు రావడం కొంతమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mushroom Benefits: పుట్టగొడుగులతో మొటిమలకు చెక్.. ముఖం మరింత అందంగా కనిపించాలంటే మష్రూమ్స్ ఇలా వాడాల్సిందే..

TGWDCW Recruitment: తెలంగాణలో పది ఉత్తీర్ణులైన మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Raja Raja Chora Review: ఇంతకీ శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ ప్రేక్షకుల మనసులు కొల్లగొడతాడా?