Bollywood : బాలీవుడ్ సెలబ్రిటీలకు ముచ్చెమటలు.. ఆ వీడియోలు సేకరించిన గ్యాంగ్.. ఏకంగా 100 మంది

Bollywood : బాలీవుడ్ సెలబ్రిటీలకు ముచ్చెమటలు.. ఆ వీడియోలు సేకరించిన గ్యాంగ్.. ఏకంగా 100 మంది
Bollywood

మరోసారి హాట్ టాపిక్ గా మారింది బాలీవుడ్. ఇప్పటికే చాలా వివాదంలో బాలీవుడ్ పేరు నిత్యం వార్తల్లో వినిపిస్తూనే ఉంది. సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్ పేరు..

Rajeev Rayala

|

Aug 19, 2021 | 7:25 PM

Bollywood : మరోసారి హాట్ టాపిక్ గా మారింది బాలీవుడ్. ఇప్పటికే చాలా వివాదంలో బాలీవుడ్ పేరు నిత్యం వార్తల్లో వినిపిస్తూనే ఉంది. సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్ పేరు మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. ఇటీవల హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా వ్యవహారం రచ్చ లేపిన విషయం తెలిసిందే. అశ్లీల చిత్రాలు నిర్మిస్తున్నారన్న ఆరోపణలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు. సినిమా అవకాశాల కోసం వచ్చే యువతులను బలవంతంగా ఈ ఊబిలోకి దింపుతున్నారని పోలీసులు తేల్చారు. ఈ ఘటన మరువక ముందే ఇప్పుడు మరో వ్యవహారం బయటకు వచ్చింది. ముంబయి సెక్స్ టార్షన్ గ్యాంగ్ చేతిలో బాలీవుడ్ సెలబ్రిటీల నగ్న వీడియోలు ఉన్నాయని తెలుస్తుంది.

బాలీవుడ్ సెలబ్రిటీలను ట్రాప్ చేసి.. నగ్న వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తుంది ఈ ముఠా. ఈ ట్రాప్ 100 మందికి పైగా సెలబ్రిటీలు ఉన్నారని తెలుస్తోంది. బాధితులలో టాప్ సెలబ్రిటీలతో పాటు మోడల్స్, రిచ్ కిడ్స్ ఉన్నారని సమాచారం. సోషల్ మీడియా వేదికలైన స్నాప్‌‌చాట్ , ఇన్స్టాగ్రామ్‌‌లో ఫ్రెండ్ షిప్ చేసి. ఆతర్వాత 6 నెలలు నమ్మకం కుదిరాక ట్రాప్‌లోకి దింపి నగ్నంగా వీడియో కాల్స్ చేయడం. వాటిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్స్ చేయాడం, అలాగే డబ్బులు డిమాండ్ చేయడం వంటివి చేస్తున్నారు. అంతే కాదు ట్విట్టర్ ద్వారా కొన్ని వీడియోలు అమ్మినట్లు తెలుస్తోంది. దాంతో కొందరు సెలబ్రెటీలు ముంబై సైబర్ సెల్‌ను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నలుగురు నిందితుల అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 285 మంది నగ్న వీడియోలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక నిందితులంతా ఇంజనీరింగ్, సైన్స్ గ్రాడ్యుయేట్స్ అని పోలీసుల విచారణలో తేలింది. ఈ వ్యవహారంతో మరోసారి బాలీవుడ్ ఉలిక్కి పడింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Balakrishna: విలన్ పాత్రకోసం విలక్షణ నటుడు.. బాలయ్య కోసం బరిలోకి తమిళ్ హీరో

Sai Dharam Tej – Vaishnav Tej: మెగా బ్రదర్స్ మధ్య బాక్సాఫీస్ వార్.. వారం గ్యాప్‌లో రిలీజ్ అవుతున్న సినిమాలు..

Nayanthara : మెగాస్టార్ లూసిఫర్ రీమేక్‌లో నయనతార పాత్ర అదేనా..? క్లారిటీ వచ్చేసినట్టే.. ?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu