20 Years of Devdas: 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఎపిక్ రొమాంటిక్ డ్రామా ‘దేవదాస్’
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన కెరీర్ లో ఎన్నో మైలురాళ్ళను సాధించారు. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి స్టార్ హీరోగా మారారు. షారుక్ కెరీర్ లో బిగెస్ట్ హిట్స్ లో దేవదాస్ ఒకటి.

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్(Shahrukh Khan)తన కెరీర్ లో ఎన్నో మైలురాళ్ళను సాధించారు. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి స్టార్ హీరోగా మారారు. షారుక్ కెరీర్ లో బిగెస్ట్ హిట్స్ లో దేవదాస్ ఒకటి. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన మూడో చిత్రం ‘దేవదాస్’ తాజాగా 20వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఎపిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన దేవదాస్ సినిమా2002 లో విడుదలైంది. ఇందులో షారుఖ్ ఖాన్ (దేవదాస్), ఐశ్వర్య రాయ్ (పారో), మాధురీ దీక్షిత్ (చంద్రముఖి) పాత్రల్లో నటించారు. 1917లో శరత్ చంద్ర చటోపాధ్యాయ రాసిన నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. ఈ సినిమా ఇప్పటికీ ఎవరు గ్రీన్ మూవీగా ప్రేక్షకాదరణ పొందుతోంది. దేవదాస్ సినిమా ఆ సమయంలో అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది మరియు ఐదు జాతీయ అవార్డులను కూడా గెలుచుకుంది.
షారుక్ , ఐశ్వర్య, మాధురి దీక్షిత్ మధ్య కెమిస్ట్రీ నిజంగా అద్భుతం అనే చెప్పాలి. ఎవరికి వారు పోటీపడి నటించిన ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. సంజయ్ లీలా బన్సాలీ అద్భుత కళాఖండాన్ని కీర్తిస్తూ సోషల్ మీడియా ట్వీట్లతో హోరెత్తుతోంది. ఈ సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు ట్విట్టర్‌లో సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. షారుక్ అభిమానులు ఈ సినిమాలోని సన్నివేశాలను, ఫోటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.




Devdas – a piece of art by Sanjay Leela Bhansali#20YearsOfDevdas pic.twitter.com/5rjtjYE3xM
— Md Kabila Sarker (@kabilasrkian75) July 12, 2022
Queen of bollywood @MadhuriDixit? #20YearsOfDevdas #MadhuriDixit❤️? pic.twitter.com/SdxCDI7NLi
— ★Kajol★ (@Miss_kaju_09) July 12, 2022
Celebrating 20 Years Of Devdas This Picture Spécial for the movie Devdas i Hope than you enjoy ? @iamsrk @MadhuriDixit#20YearsOfDevdas pic.twitter.com/0SXE4WCyDY
— Barbara Khan (@Barbara70579822) July 12, 2022
The best scene in Bollywood movie industry.#20YearsOfDevdaspic.twitter.com/HNrrQ0Emvw
— mahaa.. (@MahaSRK1) July 11, 2022