Shahid Kapoor Jersey Trailer : మరోసారి నటనతో కట్టిపడేసిన షాహిద్.. “జెర్సీ” ట్రైలర్

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఇప్పుడు తెలుగు సినిమాలపై మనసు పడ్డారు. ఇప్పటికే అర్జున్ రెడ్డిని కబీర్ సింగ్ గా మార్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో..

Shahid Kapoor Jersey Trailer : మరోసారి నటనతో కట్టిపడేసిన షాహిద్.. జెర్సీ ట్రైలర్
Jersey

Updated on: Nov 23, 2021 | 6:14 PM

Shahid Kapoor: బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఇప్పుడు తెలుగు సినిమాలపై మనసు పడ్డారు. ఇప్పటికే అర్జున్ రెడ్డిని కబీర్ సింగ్ గా మార్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యాడు. నాని నటించిన జెర్సీ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే..గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా విమర్శకుల ప్రసంశలు అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న షాహిద్. ఈ సినిమాలో నాని క్రికెటర్  గా కనిపించాడు. క్రికెటర్ గా కనిపించడం కోసం చాలా కష్టపడ్డాడు నాని. అలాగే షాహిద్ కూడా చాలా కష్టపడ్డాడు. క్రికెట్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈక్రమంలో ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.

క్రికెట్ తో ముడిపడిన ఎమోషనల్ స్టోరీ ఇది. తొలి సినిమాతోనే హిట్ కొట్టిన గౌతమ్ హిందీలోనూ ఆయనే డైరెక్ట్ చేశారు. షాహిద్ సరసన మృణాలిని ఠాకూర్ కనిపించనుంది. పంకజ్ కపూర్ .. శిశిర్ శర్మ .. శరద్ కేల్కర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. దాంతో ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అయ్యింది. మొత్తానికి ఈ సినిమాను డిసెంబర్ 31వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.ఈ సినిమాకి అల్లు అరవింద్ .. దిల్ రాజు .. అమన్ గిల్ నిర్మాతలుగా వ్యవహరించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: ముద్దులొలికే ఈ చిన్నారికి ఇప్పుడు అబ్బాయిల్లో పిచ్చ ఫాలోయింగ్! ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

Evaru Meelo Koteeswarulu: తారక్‏తో మహేశ్ ముచ్చట్లు మాములుగా లేవుగా.. అదిరిపోయిన ప్రోమో..

Pooja Kannan: హీరోయిన్‏గా ఎంట్రీ ఇస్తున్న సాయి పల్లవి చెల్లెలు.. అక్కకు ఏమాత్రం తీసిపోని పూజ కన్నన్.. బ్యూటీఫుల్ ఫోటోస్..