Shah Rukh Khan and Katrina Kaif : బాలీవుడ్‌లో మరోసారి కరోనా కలకలం.. షారుక్, కత్రినాకు పాజిటివ్

కరోనా కలలం మళ్ళీ మొదలైంది. భారత్ లో మరోసారి కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గతంలో చాలా మంది సినిమా తారలు కరోనా భారిన పడిన విషయం తెలిసిందే..

Shah Rukh Khan and Katrina Kaif : బాలీవుడ్‌లో మరోసారి కరోనా కలకలం.. షారుక్, కత్రినాకు పాజిటివ్
Shah Rukh Khan And Katrina

Updated on: Jun 05, 2022 | 3:52 PM

కరోనా కలలం మళ్ళీ మొదలైంది. భారత్ లో మరోసారి కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గతంలో చాలా మంది సినిమా తారలు కరోనా భారిన పడిన విషయం తెలిసిందే.. తాజాగా బాలీవుడ్ లో మరోసారి కరోనా కలకలం రేపింది. స్టార్ హీరో షారుక్ ఖాన్(Shah Rukh Khan )కరోనా భారిన పడ్డారు. స్వల్పలక్షణాలతో ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అలాగే మరో స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్(Katrina Kaif )కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. షారుక్, కత్రినాకు కరోనా పాజిటివ్ అని తెలియడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. షారుక్, కత్రినా త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు అభిమానులు.

షారుక్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తున్నాడు.రీసెంట్ గా ఈ సినిమా నుంచి షారుక్ లుక్ ను రిలీజ్ చేశారు . అలాగే కత్రినా కైఫ్ ఇటీవలే విక్కీ కౌశల్ లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఓ వెబ్ సిరీస్ లో నటిస్తుంది.

ఇవి కూడా చదవండి