Salman Khan: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించిన సల్మాన్ ఖాన్.. కీలక నిర్ణయం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల పలువురు సంతాపం తెలిపారు . రాజకీయ రంగానికి చెందిన వ్యక్తులే కాకుండా సినీ ప్రముఖులు కూడా మాజీ ప్రధానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అన్ని రకాల కార్యక్రమాలు, వేడుకలను నిలిపివేశారు. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు.
సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘సికందర్’. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే శుక్రవారం (డిసెంబర్ 27)న ‘సికందర్’ టీజర్ విడుదల కావాల్సింది. అయితే చిత్ర బృందం ప్లాన్ మార్చేసింది. అవును.. మన్మోహన్ సింగ్ మరణం కారణంగా ‘సికిందర్’ సినిమా టీజర్ విడుదల క్యాన్సిల్ అయింది. మాజీ ప్రధానికి నివాళిగా సల్మాన్ ఖాన్ టీమ్ టీజర్ విడుదల తేదీని కేవలం ఒక రోజు వాయిదా వేయాలని నిర్ణయించుకుంది. కొత్త ప్లాన్ ప్రకారం డిసెంబర్ 28న ‘సికిందర్’ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర బృందం ఓ ప్రకటన విడుదల చేసింది. సాజిద్ నడియవాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తన నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ఖాతాలో టీజర్ గురించి అప్‌డేట్ ఇవ్వబడింది. గౌరవనీయులైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం కారణంగా మా సినిమా సికందర్ టీజర్ విడుదల సమయం డిసెంబర్ 28 ఉదయం 11:07 AM కి వాయిదా పడింది. ఆయన మరణం మమ్మల్ని కూడా కలిచి వేసింది. అభిమానులు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు’ అని సికందర్ చిత్ర బృందం ట్వీట్ చేసింది.
‘గజిని’, ‘తుపాకి’, ‘కత్తి’, ‘దర్బార్’ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కించారు ఏఆర్ మురుగదాస్. ఇప్పుడు సికందర్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నారు. సికందర్ చిత్రాన్ని సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నతో పాటు కాజల్ అగర్వాల్ కూడా నటిస్తోంది. ఇటీవల విడుదలైన బేబీ జాన్’ సినిమాలోనూ సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు.
సికందర్ సినిమా యూనిట్ ట్వీట్..
In light of the passing of our esteemed former Prime Minister Manmohan Singh Ji, we regret to announce that the release of the Sikandar teaser has been postponed to 28th December 11:07 AM. Our thoughts are with the nation during this time of mourning. Thank you for understanding.…
— Nadiadwala Grandson (@NGEMovies) December 27, 2024
హైదరాబాద్ లో సల్మాన్ మూవీ షూటింగ్..
Exclusive video from the set of #Sikandar #SalmanKhan @BeingSalmanKhan @iamRashmika @MsKajalAggarwal
— 𝐁𝐄𝐈𝐍𝐆 𝐓𝐈𝐆𝐄𝐑…🐅!!! (@Only4Salman27) November 4, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.