Salman Khan: అద్దెకు సల్మాన్ ఖాన్ అపార్ట్‏మెంట్.. నెలకు రెంట్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..

ఈ ఏడాది ప్రారంభంలోనే వాల్తేరు వీరయ్య సినిమాతో ఇటు తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు బీటౌన్ లో అత్యధికంగా సంపాదిస్తోన్న హీరోలలో సల్మా్న్ ఒకరు. అలాగే భారతదేశంలోని అత్యంత సంపన్న నటులలో ఆయన ఒకరు. సల్మాన్ ఖాన్ విలాసవంతమైన గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లలో నివసిస్తున్నారు. అంతేకాకుండా ముంబైలో అనేక ఆస్తులను కలిగి ఉన్నారు. అయితే ఇటీవల తనకున్న అపార్ట్మెంట్ లలో ఒకదానిని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

Salman Khan: అద్దెకు సల్మాన్ ఖాన్ అపార్ట్‏మెంట్.. నెలకు రెంట్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
Salman Khan

Updated on: Sep 26, 2023 | 6:45 PM

పాన్ ఇండియా సినీ ప్రియులకు సల్మాన్ ఖాన్ ఫేవరేట్ హీరో. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందుకుని స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. దక్షిణాదిలో ఈ హీరోకు అభిమానులున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే వాల్తేరు వీరయ్య సినిమాతో ఇటు తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు బీటౌన్ లో అత్యధికంగా సంపాదిస్తోన్న హీరోలలో సల్మా్న్ ఒకరు. అలాగే భారతదేశంలోని అత్యంత సంపన్న నటులలో ఆయన ఒకరు. సల్మాన్ ఖాన్ విలాసవంతమైన గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లలో నివసిస్తున్నారు. అంతేకాకుండా ముంబైలో అనేక ఆస్తులను కలిగి ఉన్నారు. అయితే ఇటీవల తనకున్న అపార్ట్మెంట్ లలో ఒకదానిని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

నివేదికల ప్రకారం, సల్మాన్ ఖాన్ ముంబైలోని శాంతాక్రజ్‌లో తన ప్రధాన వాణిజ్య ప్రాపర్టీలో ఒకదానిని అద్దెకు ఇస్తున్నారట. అద్దె ఒప్పందం ఆగస్టు నుండి 60 నెలల కాలవ్యవధికి సెట్ చేయబడింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం,భవనంలోని కింది అంతస్తు.. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు.. రెండవ అంతస్తులను కలిగి ఉంటుంది. నివేదికల ప్రకారం మొదటి సంవత్సరంలో ఈ భవనం నెల అద్దె రూ.90 లక్షలు. ఇక రెండవ సంవత్సరంలో రూ. 1 కోటికి చేరుకుంటుంది. తదుపరి సంవత్సరాల్లో ఈ మొత్తం రూ. 5 లక్షలకు పెరుగుతుందని అంచనా. మూడవ సంవత్సరం రూ. 1.05 కోట్లు, నాలుగు మరియు ఐదవ సంవత్సరానికి వరుసగా రూ. 1.10 కోట్లు, రూ. 1.15 కోట్లు. సల్మాన్ ఖాన్ ముంబైలోని బాంద్రా వెస్ట్‌లోని శివ్ అస్థాన్ హైట్స్‌లో నెలకు రూ. 95,000 చొప్పున మరో అపార్ట్‌మెంట్‌ను అద్దెకు ఇచ్చాడని సమాచారం.

ఇక సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన టైగర్ 3 చిత్రంలో నటిస్తున్నారు. నవంబర్ నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అక్టోబర్ 15 నుండి బిగ్ బాస్ 17 కి హోస్ట్‌గా కూడా కనిపించనున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.