Salman Khan: గుడ్‌న్యూస్ చెప్పిన సల్మాన్..ఆ సూపర్ హిట్ సినిమాకు సిక్వెల్ ఉంటుందటా..
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇద్దరు స్టార్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఆర్ఆర్ఆర్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్.
ఈ క్రమంలోనే నిన్న ముంబైలో ఘనంగా ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలో సల్మాన్ ఎంట్రీ అదిరిపోయింది. వెలుగుల కాంతిలో క్రేన్ తో అమర్చిన స్పెషల్ వాహనంలో పై నుంచి కిందకు దిగి మాస్ ఎంట్రీ ఇచ్చారు సల్మాన్. అనంతరం సల్మాన్ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించాడు. డైరెక్టర్ రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్‌లను పొగడ్తలతో ముంచేత్తారు. ఈ క్రమంలోనే అభిమానులకు మరో శుభవార్త అందించారు సల్మాన్ భాయ్.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉత్తరాదిలోనే కాకండా.. దక్షిణాదిలోనూ సల్మాన్‌కు అత్యంత భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. సల్మాన్ సినిమాలకు ఇటు దక్షిణాదిలోనూ ఆదరణ ఎక్కువే ఉంటుంది. ఇక సల్మాన్ నటించిన బజరంగీ భాయిజాన్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల సునామిన సృష్టించింది. ఈ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ తీసుకువస్తున్నట్లుగా ప్రకటించారు సల్మాన్. బజరంగీ.. కి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్.. (రాజమౌళి తండ్రి) కొనసాగింపు చిత్రానికి కథ అందిస్తారని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. బజరంగీ భాయిజాన్ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. పాకిస్థాన్‌కు చెందిన ఓ మూగ చెవిటి చిన్నారిని తన కన్నవారి వద్దకు చేర్చేందుకు భారతీయ యువకుడు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడనేదే ఈ సినిమా.
Bigg Boss 5 Telugu Winner: విన్నర్ ఎవరో ముందే చెప్పేసిన రోల్ రైడా.. అందరూ షాక్..