ఒకేసారి ఐదు చిత్రాల రిలీజ్ డేట్స్‌ను ప్రకటించిన యశ్‌రాజ్ ఫిలిమ్స్.. ఏ ఏ చిత్రాలు ఎప్పుడెప్పుడంటే..
భారీ చిత్రాలు విడుదలైతేనే ఎప్పటిలాగా సినిమా థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతాయని సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వం థియేటర్లలో 100శాతం
భారీ చిత్రాలు విడుదలైతేనే ఎప్పటిలాగా సినిమా థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతాయని సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వం థియేటర్లలో 100శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు ఇచ్చినా బాలీవుడ్ నుంచి భారీ చిత్రాల ప్రకటనలు రావడం లేదు. అయితే యశ్‌రాజ్ ఫిలిమ్స్ మాత్రం ముందుకొచ్చి ఒకసారి ఐదు చిత్రాల విడుదల తేదీలను ప్రకటించింది. ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’, ‘బంటీ ఔర్ బబ్లీ 2’, ‘షమ్‌షేరా’, ‘జయేష్‌బాయ్ జోర్దార్’, ‘పృథ్విరాజ్’.. ఈ ఐదు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
అర్జున్ కపూర్, పరిణీతి చోప్రా జంటగా నటించిన ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేయనున్నారు. దివాకర్ బెనర్జీ ఈ చిత్రానికి దర్శకుడు. వరుణ్ శర్మ దర్శకత్వంలో సైఫ్ అలీఖాన్, రాణీ ముఖర్జీ, సిద్ధాంత్ చతుర్వేది, శర్వరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంటీ ఔర్ బబ్లీ 2’. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుదల చేస్తారు. రణ్‌బీర్ కపూర్, సంజయ్ దత్, వాణీ కపూర్ ప్రధాన పాత్రల్లో కరణ్ మల్హోత్ర రూపొందించిన ‘షమ్‌షేరా’ జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. రణ్‌వీర్ సింగ్, షాలినీ పాండే జంటగా నటించిన ‘జయేష్‌బాయ్ జోర్దార్’ను ఆగస్టు 27న విడుదల చేయనున్నారు. దివ్యాంగ్ టక్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్‌కుమార్ కథానాయకుడిగా చంద్ర ప్రకాష్ ద్వివేది తెరకెక్కిస్తోన్న ‘పృథ్విరాజ్’ చిత్రాన్ని నవంబరు 5న దీపావళి కానుకగా విడుదల చేస్తున్నారు. ఈ సంస్థ తీసుకున్న సాహోసోపేతమైన నిర్ణయంతో మరిన్ని పెద్ద సినిమాలు డేట్స్ ప్రకటించాలని సినీ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు.
ఉప్పెన హీరోయిన్‌పై ప్రశంసల జల్లు.. భవిష్యత్‌లో ఆమె డేట్స్ దొరకడం కష్టమంటున్న మెగా పవర్ స్టార్..