Deepika Padukone: పూజా కార్యక్రమాలతో కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన దీపిక దంపతులు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు

Deepika Padukone- Ranveer Singh: బాలీవుడ్‌లో ఉన్న సెలబ్రిటీ జంటల్లో దీపికా పదుకొణె- రణ్‌వీర్ సింగ్‌ ఒకరు. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌ కొనసాగిస్తోన్న ఈ లవ్లీకపుల్‌ తాజాగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు.

Deepika Padukone: పూజా కార్యక్రమాలతో కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన దీపిక దంపతులు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు
Deepika Padukone

Edited By: Ravi Kiran

Updated on: Aug 20, 2022 | 7:37 PM

Deepika Padukone- Ranveer Singh: బాలీవుడ్‌లో ఉన్న సెలబ్రిటీ జంటల్లో దీపికా పదుకొణె- రణ్‌వీర్ సింగ్‌ ఒకరు. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌ కొనసాగిస్తోన్న ఈ లవ్లీకపుల్‌ తాజాగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ముంబై సముద్ర తీరంలోని అలీబాగ్‌లోని ఇంటిలోకి పూజా కార్యక్రమాలతో గృహ ప్రవేశం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు రణ్‌వీర్‌. కాగా భవనం మొత్తం 2.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఐదు బెడ్‌రూంలు ఉన్నాయి. ఈ అధునాతన భవంతి ధర రూ.22 కోట్లు అని సమాచారం. కాగా ప్రస్తుతం రణ్‌వీర్, దీపిక ముంబై‌లోని ప్రభాదేవి ప్రాంతంలో నివసిస్తున్నారు. కొత్త ఇంటిని విడిది కేంద్రంగా ఉపయోగించుకోవాలని యోచనలో ఉన్నారు దీపిక దంపతులు.

ఇక సినిమాల విషయానికొస్తే.. దీపిక, రణ్‌వీర్‌లు 83 సినిమాలో జంటగా మెరిశారు. పెళ్లి తర్వాత వీరిద్దరు సిల్వర్‌స్ర్కీన్‌ను షేర్‌ చేసుకున్న మొదటి చిత్రమిదే. ప్రస్తుతం దీపిక షారుఖ్‌ఖాన్‌ పఠాన్, హృతిక్‌ రోషన్‌ ఫైటర్ చిత్రాలతో బిజీగా ఉంటోంది. అలాగే తెలుగులో ప్రభాస్‌ సరసన ప్రాజెక్ట్-కెలోనూ నటిస్తోంది. ఇక జయేశ్‌బాయ్‌ జోర్దార్‌తో నిరాశపర్చిన రణ్‌వీర్‌ చేతిలో రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ, సర్కస్ తదితర సినిమాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..