AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanishka Soni: మాటమీద నిలబడే మగాడ్ని నేను చూడలేదు.. తనని తానే పెళ్లి చేసుకున్న పాపులర్ సీరియల్ నటి

గుజరాతీ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చానని, పెళ్లి అనేది తన చిరకాల కోరిక అని తెలిపింది. తాను పాపులర్ సీరియల్స్ లో నటించినా రాని గుర్తింపు ఇప్పుడు తనని తాను పెళ్లి చేసుకోవడంతో వచ్చిందంటూ హర్షం వ్యక్తం చేస్తోంది కనిష్కా.

Kanishka Soni: మాటమీద నిలబడే మగాడ్ని నేను చూడలేదు.. తనని తానే పెళ్లి చేసుకున్న పాపులర్ సీరియల్ నటి
Kanishka Soni
Surya Kala
| Edited By: |

Updated on: Aug 20, 2022 | 7:36 PM

Share

Kanishka Soni: ప్రకృతి, పురుషుడు కలిస్తే సృష్టి.. అయితే మనిషి.. ఆధునిక స్వేచ్ఛ పేరుతో వింత పోకడలకు పోతున్నాడు.. పురుషుడిని పురుషుడు.. స్త్రీని మరో స్త్రీ ప్రేమించి పెళ్లి పెళ్లి చేసుకుంటున్నాడు. ఇలాంటి పెళ్లిళ్లు సర్వసాధారణంగా మారిపోయాయి అనుకుంటున్న సమయంలో మరొక అడుగు ముందుకు వేసి.. తనని తానే పెళ్లి చేసుకుంటూ సంచలనం సృష్టిస్తున్నారు కొందరు. ఇప్పటికే ఇలాంటి పెళ్లి చేసుకున్న యువతి గురించి విన్నాం.. అయితే ఇప్పుడు పాపులర్ సినీ నటి కూడా తనని తానూ పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది.

హిందీలో పాపులర్ సీరియల్ దియా ఔర్‌ బాతి హమ్‌. తెలుగులో ‘దియా ఔర్‌ బాతి హమ్‌’ .. ‘ఈ తరం ఇల్లాలు’గా డబ్ అయి తెలుగు ప్రేక్షకుల ఆదరణ కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.. ఈ సీరియల్ లో కవిత పాత్రలో నటించి పాపులర్‌ అయిన గుజరాత్‌ నటి కనిష్కా సోని కొన్ని సినిమాల్లోనూ నటించింది. అయితే తాజాగా తననే తానే పెళ్లాడినట్టు ఇన్‌స్టా ద్వారా ప్రకటించింది.  ఇటీవల ఆమె నుదుటన సింధూరం, మెడలో మంగళసూత్రంతో ఉన్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. దీంతో అభిమానులు ఆరా తీయగా అసలు విషయం బయటపెట్టింది. తనను తానే పెళ్లి చేసుకున్నానని తెలిపింది.

ఇవి కూడా చదవండి

కనిష్కా ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజ్ఞానం, సాంకేతికత ఎంతో ప్రగతి సాధించాయని, ఓ మహిళ శృంగారానికి పురుషుడితో ఇక పని లేదన్నారు ఆమె. మాట మీద నిలబడే మగాడ్ని తన జీవితంలో చూడలేదని, అందుకే పురుషుడు లేకుండానే జీవితం గడపాలన్న నిర్ణయానికొచ్చానని పేర్కొన్నారు. తాను గుజరాతీ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చానని, పెళ్లి అనేది తన చిరకాల కోరిక అని తెలిపింది. తాను పాపులర్ సీరియల్స్ లో నటించినా రాని గుర్తింపు ఇప్పుడు తనని తాను పెళ్లి చేసుకోవడంతో వచ్చిందంటూ హర్షం వ్యక్తం చేస్తోంది కనిష్కా.

మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..