Ranbir Kapoor: సెల్ఫీ అడిగిన అభిమాని.. ఫోన్ లాక్కొని విసిరేసిన స్టార్ హీరో..

|

Jan 27, 2023 | 10:06 PM

ఓ ప్లేస్​లో రణ్​బీర్​ ఉండగా.. ఆయనతో కలిసి సెల్ఫీ దిగేందుకు ఓ అభిమాని యత్నించాడు. అయితే మొదట బాగానే పోజు ఇచ్చిన రణ్​బీర్​

Ranbir Kapoor: సెల్ఫీ అడిగిన అభిమాని.. ఫోన్ లాక్కొని విసిరేసిన స్టార్ హీరో..
Ranbir Kapoor
Follow us on

బాలీవుడ్ హీరో​ రణ్​బీర్ కపూర్​ ఒక అభిమాని పట్ల దురుసుగా ప్రవర్తించారు. అభిమాని చర్య వల్ల విసుగు చెందారో లేదా పబ్లిసిటీ స్టంట్​లో భాగంగా అలా చేశారో తెలియదు కానీ.. ఆయన చేసిన ఓ పని మాత్రం సోషల్​ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన ఓ ఫ్యాన్​ మొబైల్‌ ఫోన్‌ను లాక్కొని విసిరేశారు.

ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు ఓ ప్లేస్​లో రణ్​బీర్​ ఉండగా.. ఆయనతో కలిసి సెల్ఫీ దిగేందుకు ఓ అభిమాని యత్నించాడు. అయితే మొదట బాగానే పోజు ఇచ్చిన రణ్​బీర్​ ఆ తర్వాత సహనం కోల్పోయాడు. ఎందుకంటే సదరు ఫ్యాన్‌​.. ఫొటో దిగే సమయంలో ఆ పిక్ సరిగ్గా వచ్చినట్టు లేదు. దీంతో అతడు రణ్​బీర్​ను వెళ్లనివ్వకుండా మళ్లీ సెల్ఫీ దిగేందుకు ట్రై చేశాడు. ఈ క్రమంలోనే రణ్​బీర్​.. ఆ వ్యక్తి దగ్గర నుంచి ఫోన్‌ లాక్కొని విసిరేశాడు.

ఇవి కూడా చదవండి

ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. కొంతమంది నెటిజన్లు రణ్​బీర్ ప్రవర్తనను తప్పుబడుతున్నారు. అలా చేయడం సరికాదని అంటున్నారు. కాగా, రణ్​బీర్ ఇటీవలే​ ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంతో సూపర్​ హిట్​ అందుకున్నారు. తాజాగా శ్రద్ధా కపూర్​తో కలిసి నటించిన రొమాంటిక్‌ కామెడీ తూ ఝూఠీ.. మై మక్కార్‌ ట్రైలర్‌ విడుదలైంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.