Priyanka Chopra-Nick Jonas : ప్రియాంక చోప్రా – నిక్ జోనస్ గారాల పట్టి పేరేంటో తెలుసా?

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీతో పాటు హాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ గ్లోబల్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది ఈ అందాల భామ.

Priyanka Chopra-Nick Jonas : ప్రియాంక చోప్రా - నిక్ జోనస్ గారాల పట్టి పేరేంటో తెలుసా?
Priyanka Chopra Nick Jonas

Updated on: Apr 21, 2022 | 12:36 PM

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీతో పాటు హాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ గ్లోబల్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది ఈ అందాల భామ. ప్రియాంక అమెరికన్ యాక్టర్ నిక్ జోనాస్(Nick Jonas) ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రియంక చోప్రా, నిక్ లు డిసెంబర్ 2018లో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి జరిగి దాదాపు మూడేళ్లు దాటింది. ప్రియాంకా చోప్రా- నిక్ జోన‌స్ ఇటీవ‌లే స‌రోగ‌సి ద్వారా పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. అప్పుడు జూనియర్ ప్రియాంకా వచ్చేసిందంటూ ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ పెట్టింది పీసీ. దాంతో ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తాయి. అయితే అప్పటి నుంచి తమ బిడ్డ గురించి అటు నిక్ కానీ ఇటు ప్రియాంక కానీ ఎలాంటి అప్‌డేట్‌ను షేర్ చేయలేదు.

తాజాగా ప్రియాంక, నిక్ తమ బిడ్డకు పేరు పెట్టారని తెలుస్తుంది. ప్రియాంక- నిక్‌లు తమ ముద్దుల పాపకు మాల్తీ మేరీ చోప్రా జోనాస్ అని పేరు పెట్టారు. మాల్తీ అంటే సంస్కృత పదం. దీని అర్ధం సువాసనగల పువ్వు లేదా చంద్రకాంతి అని. అలాగే మేరీ లాటిన్ స్టెల్లా మారిస్ నుండి వచ్చింది.. దీని అర్ధం సముద్ర నక్షత్రం. అదేవిధంగా జీసస్ తల్లి అయిన మేరీ పేరుకూడా కలుస్తుంది. చివరకు తన పేరు, భర్త పేరు వచ్చేలా పాపకు పేరు పెట్టారు.  కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో జనవరి 15న రాత్రి 8 గంటల సమయంలో ప్రియాంక, నిక్ లు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ ఇద్దరూ పెళ్ళైన మ‌రుస‌టి ఏడాది అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌కు వెళ్లి స్థిరపడ్డారు. అక్కడే 20 మిలియన్ల డాలర్లు ( ఇండియన్ కరెన్సీలో రూ .149 కోట్లు) వెచ్చించి ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. ప్రస్తుతం ప్రియాంక ‘ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ టు మీ’ లో నటిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

F3 Movie: ఎఫ్ 3 సింగిల్ సాంగ్‏కు భారీ రెస్పాన్స్.. గంటల్లోనే మిలియన్ వ్యూస్..

Viral Photo: క్యూట్ చూపులతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి యూత్ ఫెవరేట్.. అమ్మడు ఆ పేరుతో చాలా స్పెషలండోయ్.. గుర్తుపట్టండి..

Ante Sundaraniki: నజ్రియా ఎవరి ఫోన్లు ఎత్తలేదు.. కానీ అందుకు థ్యాంక్స్.. హీరో నాని ఆసక్తికర కామెంట్స్..