
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త రాఘవ్ చద్ధా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆదివారం ఉదయం పరిణితి ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో చేరారు. ఆదివారం మధ్యాహ్నం ఆమె అబ్బాయికి జన్మనిచ్చారు. దీంతో పరిణితి చోప్రా, రాఘవ్ చద్ధా దంపతులకు సెలబ్రెటీలు, నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం పరిణీతితోపాటు ఆసుపత్రిలో ఆమె భర్త రాఘవ్ చద్దా, ఆమె తల్లి ఉన్నట్లు సమాచారం. పరిణితి చివరకు అమర్ సింగ్ చంకిలా సినిమాలో కనిపించింది.
కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు.. గత రెండేళ్ల క్రితం అంటే 2023 సెప్టెంబర్ 24న ఉదయపూర్ లో పెద్దల సమక్షంలో పరిణితి చోప్రా, రాఘవ్ చద్దా వివాహ చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహ వేడుక రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‌గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..