Kajol: నీకిది అవసరమా మేడమ్.. కాజోల్ పై మండిపడుతున్న ఫ్యాన్స్.. ఎందుకంటే..

|

Jun 11, 2023 | 12:59 PM

ముఖ్యంగా కాజోల్, షారుఖ్ ఖాన్ జోడీకి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. పెళ్లి తర్వాత చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కాజోల్.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‏లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే ఇటీవలే సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది. అంతేకాకుండా అంతకుముందు ఉన్న ఫోటోస్ డెలీట్ చేసింది.

Kajol: నీకిది అవసరమా మేడమ్.. కాజోల్ పై మండిపడుతున్న ఫ్యాన్స్.. ఎందుకంటే..
Kajol
Follow us on

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‏గా వెలుగు వెలిగిన హీరోయిన్లలో కాజోల్ ఒకరు. సినీపరిశ్రమలో టాప్ హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకుని స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ముఖ్యంగా కాజోల్, షారుఖ్ ఖాన్ జోడీకి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. పెళ్లి తర్వాత చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కాజోల్.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‏లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే ఇటీవలే సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది. అంతేకాకుండా అంతకుముందు ఉన్న ఫోటోస్ డెలీట్ చేసింది. జీవితంలో అత్యంత క్లిష్టమైన కష్టాలను ఎదుర్కొంటున్నానని కోట్ షేర్ చేస్తూ.. సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు రాసుకోచ్చింది. దీంతో అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరికొందరు మాత్రం ఇదంతా తన సినిమా ప్రమోషన్ కోసమని భావించారు. తాజాగా కాజోల్ ఇన్ స్టాలో అన్ని పోస్టులు తిరిగి వచ్చాయి.

ఇప్పటివరకు డెలీట్ అయిన అన్ని ఫోటోస్ తిరిగి అకౌంట్లోకి వచ్చేసాయి. దీంతో ఇదంతా ఆమె నటిస్తోన్న కొత్త సిరీస్ గుడ్ వైఫ్ ప్రమోషన్లలో భాగంగానే కాజోల్ ఇలాంటి పోస్ట్ షేర్ చేసినట్లు అర్ధమవుతుంది. దీంతో కాజోల్ తీరుపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇకపై మిమ్మల్ని ఎవరూ నమ్మరు.. మీరు కూడా ఇలాంటి ప్రమోషన్ పద్దతిని సెలక్ట్ చేసుకున్నారు.. మీలాంటి స్టార్ హీరోయిన్‏కు ఇలాంటి ప్రమోషన్ అవసరమా. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ది గుడ్ వైఫ్.. ఇది పొలిటికల్ డ్రామా థ్రిల్లర్. ఈ వెబ్ సిరీస్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో కాజోల్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. దీనికి సుపాన్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ చూస్తుంటే ఇందులో కాజోల్ లాయర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.