Madhuri Dixit Nene: పొలిటికల్ ఎంట్రీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన మాధురీ దీక్షిత్
మాధురీ దీక్షిత్ రాజకీయాల్లోకి రావడం.. ముంబైలోని ఒక నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం పై జోరుగా చర్చ జరుగుతోంది. ఎట్టకేలకు దీనిపై జరుగుతున్న చర్చలకు మాధురీ దీక్షిత్ స్వయంగా సమాధానమిచ్చింది. మాధురీ దీక్షిత్ తన కొత్త మరాఠీ చిత్రం 'పంచక్' ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె 'టీవీ9 మరాఠీ'తో ఇంటర్వ్యూ ఇచ్చారు.

మరికొద్ది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. మాధురీ దీక్షిత్ రాజకీయాల్లోకి రావడం.. ముంబైలోని ఒక నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం పై జోరుగా చర్చ జరుగుతోంది. ఎట్టకేలకు దీనిపై జరుగుతున్న చర్చలకు మాధురీ దీక్షిత్ స్వయంగా సమాధానమిచ్చింది. మాధురీ దీక్షిత్ తన కొత్త మరాఠీ చిత్రం ‘పంచక్’ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె ‘టీవీ9 మరాఠీ’తో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె పొలిటికల్ ఎంట్రీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
మాధురీ దీక్షిత్ రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు. సినీ పరిశ్రమలో కొనసాగాలని కోరుకుంటున్నా. ‘‘ఎన్నికల సమయంలో నేను పోటీ చేస్తాననే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ, రాజకీయాలు నా ఇంట్రస్ట్ కాదు. మాధురీ దీక్షిత్ మాట్లాడుతూ నా పంచక్ సినిమా విజయం సాధిస్తే మరిన్ని సినిమాలు చేసేలా ఇంట్రెస్ట్ వస్తుంది.
మాధురీ దీక్షిత్ తన కుటుంబం గురించి కూడా మాట్లాడారు. మాధురీ దీక్షిత్ కు కొంకణి వస్తుందని కూడా ప్రచారం జరిగింది. దీనికి ఆమె సమాధానమిచ్చారు. ‘నాకు కొంకణి అంతగా రాదు. కానీ నాకు అర్ధమవుతుంది. అమ్మమ్మ కొంకణి పాటలు పాడేది. మా అమ్మ మరాఠీ మాట్లాడేది.’ జనవరి 5న ‘పంచక్’ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాను అని తెలిపారు. మాధురీ దీక్షిత్ 1984లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ‘అబోద్’ ఆమె తొలి సినిమా.. 1988లో విడుదలైన ‘తేజాబ్’ సినిమా ఆమె పాపులారిటీని పెంచింది. ఆ చిత్రంలోని ‘ఏక్ దో థీన్..’ పాట సూపర్ హిట్ అయింది. ఈ పాటలో మాధురి డ్యాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ‘తేజాబ్’ సినిమా తర్వాత మాధురి స్టార్‌డమ్ పెరిగింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




