Tollywood: 29 ఏళ్లకే కోట్ల ఆస్తులు.. యాక్టింగ్ మానేసి ప్లాస్టిక్ సర్జన్ కావాలనుకుంటున్న ముద్దుగుమ్మ..

సినీరంగంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిన్న వయసులోనే కోట్లాది ఆస్తులు సంపాదించుకుంది. కానీ ఇప్పుడు యాక్టింగ్ మానేసి ప్లాస్టిక్ సర్జన్ కావాలనుకుంటుంది. అటు సోషల్ మీడియాలోనూ గ్లామర్ ఫోజులతో నెటిజన్స్ మతిపోగొడుతుంది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరో తెలుసా.. ?

Tollywood: 29 ఏళ్లకే కోట్ల ఆస్తులు.. యాక్టింగ్ మానేసి ప్లాస్టిక్ సర్జన్ కావాలనుకుంటున్న ముద్దుగుమ్మ..
Vrushika Mehta

Updated on: Feb 20, 2025 | 9:21 PM

బాలీవుడ్ సినీ ప్రియులకు ఆమె సుపరిచితమే. చిన్న వయసులోనే అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. 29 ఏళ్ల వయసులోనే కోట్లాది విలువైన ఆస్తులు సంపాదించింది. ఇక ఇప్పుడు యాక్టింగ్ మానేసి ప్లాస్టిక్ సర్జన్ కావాలనుకుంటుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. ? తనే వృషిక మెహతా. ఫిబ్రవరి 18, 1994న అహ్మదాబాద్‌లో జన్మించిన ఈ బ్యూటీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గుజరాతీ కుటుంబంలో జన్మించిన వృషికకు కొన్ని పరిమితులు ఉన్నాయి. కానీ ఆమె కలలకు తల్లిదండ్రులు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. ఒక టీవీ షో తన ప్రపంచాన్ని మారుస్తుందని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ “నా మొదటి అవార్డు అందుకున్న రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది. ఒక కళాకారుడికి లభించే ప్రేమ, గుర్తింపు చాలా గొప్ప విషయం” అని చెప్పింది.

ఆమె కాలేజీలో ఉండగానే ‘దిల్ దోస్తీ డాన్స్’ షో కోసం ఆడిషన్‌కు వెళ్ళింది. ఈ షో ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఆడిషన్ తర్వాత ఆమె సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘దిల్ దోస్తీ డాన్స్’, ‘యే తేరీ గలియన్’, ‘సత్రంగి ససురల్’, ‘సత్య ఆయి తమన్నా’ వంటి అనేక సీరియల్స్‌లో పనిచేసింది. కానీ ‘దిల్ దోస్తీ డాన్స్’లో షారన్ పాత్ర ఇప్పటికీ అడియన్స్ మనసులలో నిలిచిపోయింది. ‘యే తేరీ గలియన్’లో పాఖి పాత్రకు ఆమె నిజమైన గుర్తింపు పొందింది.

ఇవి కూడా చదవండి

2023లో వృషిక తన చిరకాల ప్రియుడు సౌరభ్ ఘేడియాను వివాహం చేసుకుంది. ఈ జంట ఇప్పుడు కెనడాలో స్థిరపడ్డారు. నటన మానేసిన తర్వాత, వృషిక ఇప్పుడు వ్లాగింగ్ చేస్తోంది. ఆ వ్లాగ్‌లో, ఆమె ప్రజలకు సహాయం చేయడానికి విజయవంతమైన ప్లాస్టిక్ సర్జన్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పింది.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన