Actor Govinda: ఇండస్ట్రీలో లైసెన్స్ తుపాకులు ఉన్న హీరోలు వీళ్లే.. ఎవరెవరో తెలుసా..?
తన లైసెన్స్ రివాల్వర్‌ని తీసుకువెళుతుండగా, రివాల్వర్ అతని చేతిలో నుండి జారి కిందపడిపోయిం మిస్ ఫైర్ కావడంతో అతడి కాలికి బుల్లెట్ తగిలింది. దీంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు అతడిని ఆసుపత్రిలో చేర్చారు. గోవింద కాలులోని బుల్లెట్‌ను వైద్యులు తొలగించారని, ఇప్పుడు అతడి పరిస్థితి నిలకడగా ఉందని సన్నిహితులు వెల్లడించారు.
బాలీవుడ్ హీరో గోవింద ఇటీవల తన సొంత లైసెన్స్ తుపాకీ మిస్ ఫైర్ కావడంతో మోకాలిలోకి బుల్లెట్ దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అక్టోబర్ 1న తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఉదయాన్నే నటుడు గోవింద కోల్‌కతా వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అదే సమయంలో తన లైసెన్స్ రివాల్వర్‌ని తీసుకువెళుతుండగా, రివాల్వర్ అతని చేతిలో నుండి జారి కిందపడిపోయిం మిస్ ఫైర్ కావడంతో అతడి కాలికి బుల్లెట్ తగిలింది. దీంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు అతడిని ఆసుపత్రిలో చేర్చారు. గోవింద కాలులోని బుల్లెట్‌ను వైద్యులు తొలగించారని, ఇప్పుడు అతడి పరిస్థితి నిలకడగా ఉందని సన్నిహితులు వెల్లడించారు. మరోవైపు గోవిందను పరామర్శించేందుకు బాలీవుడ్ సినీ ప్రముఖులు, స్నేహితులు ఒక్కొక్కరుగా ఆసుపత్రికి చేరుకుంటున్నారు.
నార్త్ ఇండస్ట్రీలో నటుడు గోవిందకు విపరీతమైన అభిమానులు ఉన్నారు. దీంతో అతడి ఆరోగ్యం గురించి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కేవలం గోవింద మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో తమ రక్షణ కోసం లైసెన్స్ రివాల్వర్స్ ఉన్న స్టార్స్ చాలా మంది ఉన్నారు. మరి ఎవరెవరి దగ్గర తుపాకులు ఉన్నాయో తెలుసుకుందామా.
- నటుడు సన్నీ డియోల్ సొంతంగా లైసెన్స్ రివాల్వర్ కలిగి ఉన్నట్లు సమాచారం. ‘సింగ్ సాహబ్’ సినిమా షూటింగ్ సమయంలో తన రివాల్వర్‌ని ఉపయోగించాడు. సన్నీ ఎప్పుడూ ఆత్మరక్షణ కోసం రివాల్వర్‌ని వెంట పెట్టుకుంటాడు.
- కొన్నాళ్లుగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు నిత్యం హత్య బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. అందుకే తనకు సొంతంగా లైసెన్స్ రివాల్వర్ తీసుకున్నాడు. సల్మాన్ ఖాన్‌కి బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి చాలా బెదిరింపులు వచ్చాయి. నటుడి కుటుంబానికి కూడా బెదిరింపులు వస్తున్నాయి.
- నటి పూనమ్ ధిల్లాన్ కూడా తన రక్షణ కోసం రివాల్వర్ కలిగి ఉంది. మాజీ ఫెమినా మిస్ ఇండియా, నటి పూనమ్ ధిల్లాన్ తన భద్రత కోసం తుపాకీని తీసుకుంది.
- అమితాబ్ బచ్చన్‌కు కూడా రివాల్వర్ ఉంది. అతను నిజ జీవితంలో కూడా లైసెన్స్ రివాల్వర్ కలిగి ఉన్నాడు. నివేదికల ప్రకారం, ముంబైలో 26/11 ఉగ్రదాడుల తర్వాత అమితాబ్ ఈ తుపాకీని కొనుగోలు చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.