AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khushi Kapoor: మొదటి సినిమా స్పెషల్‌ స్క్రీనింగ్‌.. తల్లి శ్రీదేవి డ్రెస్‌లో మెరిసిన ఖుషి కపూర్‌.. ఫొటోస్ చూశారా?

శ్రీదేవి, బోనీకపూర్‌ల మొదటి కుమార్తె జాన్వీ కపూర్‌ ఇప్పటికే స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు రెండో కూతురు ఖుషీ కపూర్ కూడా సినిమా పరిశ్రమకు పరిచయం అవుతోంది. ఖుషి కపూర్‌నటించిన మొదటి సినిమా 'ది ఆర్చీస్' డిసెంబర్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఖుషీ కపూర్

Khushi Kapoor: మొదటి సినిమా స్పెషల్‌ స్క్రీనింగ్‌.. తల్లి శ్రీదేవి డ్రెస్‌లో మెరిసిన ఖుషి కపూర్‌.. ఫొటోస్ చూశారా?
Khushi Kapoor
Basha Shek
|

Updated on: Dec 07, 2023 | 8:53 AM

Share

దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన నటి శ్రీదేవి. అతిలోక సుందరిగా ఆదరాభిమానాలు దక్కించుకున్న ఈ అందాల తార ఇప్పుడు మన మధ్యన లేకపోయినా ఆమె సినిమాల రూపంలో మన మనసులో శాశ్వతంగా నిలిచిపోయారు. ఇప్పుడు శ్రీదేవి నట వారసత్వాన్ని కొనసాగించడానికి ఆమె ఇద్దరు కూతుర్లు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. శ్రీదేవి, బోనీకపూర్‌ల మొదటి కుమార్తె జాన్వీ కపూర్‌ ఇప్పటికే స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు రెండో కూతురు ఖుషీ కపూర్ కూడా సినిమా పరిశ్రమకు పరిచయం అవుతోంది. ఖుషి కపూర్‌నటించిన మొదటి సినిమా ‘ది ఆర్చీస్’ డిసెంబర్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఖుషీ కపూర్ శ్రీదేవిని మరోసారి గుర్తు తెచ్చుకుంది. ఎలాగంటే.. ‘ది ఆర్చీస్’ సినిమా థియేటర్లలో విడుదల కావడం లేదు. నేరుగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ సినిమా ప్రీమియర్ షో ఇటీవలే నిర్వహించారు. ఇందులో పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ప్రీమియర్ షోకు షారుక్ ఖాన్ ఫ్యామిలీ, అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ ఈవెంట్‌కి శ్రీదేవి పాత గౌను ధరించి వచ్చింది ఖుషీ కపూర్. దీంతో అందరి కళ్లు ఖుషీ కపూర్‌పైనే నిలిచాయి. ఈ ఈవెంట్‌లో ఆమెనే స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఖుషీ కపూర్‌కి ఇది చాలా ముఖ్యమైన రోజు. తన మొదటి సినిమా విడుదల సమయంలో తన తల్లిని చాలా మిస్ అయ్యిందట ఖుషి. అందుకే అమ్మ గౌను వేసుకుని వచ్చిందట. ‘ఆర్చీస్’ అనే హాస్య పుస్తకం ఆధారంగా రూపొందిన చిత్రం ‘ది ఆర్చీస్’. బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ జోయా అక్తర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ నటీనటుల పిల్లలు, మనవరాళ్లు సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా, షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, బోనీ కపూర్-శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ తదితరులు నటించారు. డిసెంబర్ 7న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ఇవి కూడా చదవండి

శ్రీదేవి గౌనులో ఖుషి కపూర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..