Kareena Kapoor: ఆ స్టార్ హీరోని కరీనా మాజీ భర్త అన్న కరణ్ జోహార్.. షాక్ అయిన హీరోయిన్

బాలీవుడ్ లో లవ్ స్టోరీలకు కొదవే లేదు. సినిమా తరాల మధ్య లవ్ స్టోరీలు చాలానే ఉన్నాయి. ఒకొక్కసారి ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారో చెప్పడం కష్టమే.. ప్రేమాయణం ఒకరితో పెళ్లి మరొకరిని చేసుకున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు.

Kareena Kapoor: ఆ స్టార్ హీరోని కరీనా మాజీ భర్త అన్న కరణ్ జోహార్.. షాక్ అయిన హీరోయిన్
Karan Johar
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 05, 2022 | 12:16 PM

బాలీవుడ్ లో లవ్ స్టోరీలకు కొదవే లేదు. సినిమా తరాల మధ్య లవ్ స్టోరీలు చాలానే ఉన్నాయి. ఒకొక్కసారి ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారో చెప్పడం కష్టమే.. ప్రేమాయణం ఒకరితో.. పెళ్లి మాత్రం మరొకరిని చేసుకున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఈ లిస్ట్ లో స్టార్ బ్యూటీ కరీనా కపూర్( Kareena Kapoor) ఒకరు. బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కరీనా కపూర్. వరుస సినిమాలతో దూసుకుపోతున్న సమయంలోనే ఈ అమ్మడు సైఫ్ అలీఖాన్ ను వివాహం చేసుకున్నారు. తన కంటే దాదాపు 13 ఏళ్ళు పెద్దవాడైన సైఫ్ ను పెళ్ళాడి ఆ మధ్య వార్తలో నిలిచారు కూడా ఈ భామ. ఇప్పుడు వీరికి ఇద్దరు కుమారులు పెళ్లితర్వాత కరీనా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ ఆమె ఫ్యామిలీకే ఎక్కువ సమయం కేటాయించారు. ఇక ఇప్పుడు మరోసారి సినిమాల్లో రాణించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్న ‘లాల్ సింగ్ చెడ్డా’సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కరణ్ జోహార్ నిర్వహిస్తున్న కాఫీ విత్ కరణ్ షోకు హాజరయ్యారు అమీర్ అండ్ కరీనా..

ఈ సందర్భంగా వారిని నవ్విస్తూనే వ్యక్తిగత విషయాలను రాబట్టే ప్రయత్నం చేశారు కరణ్. ఈ క్రమంలో కరీనా మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి కూడా కొన్ని విషయాలు బయటపెట్టించాడు. కరీనా గతంలో షాహిద్ కపూర్ తో ప్రేమలో ఉంది. ఈ ఇద్దరు జబ్ వి మెట్ సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీరి లవ్ బ్రేక్ అయ్యింది. అయితే తాజాగా జరిగిన కరణ్ షోలో కరీనా గురించి కరణ్ చెపుతూ.. కరీనా.. నువ్వు ఈ షోకు చాలా సార్లు వచ్చావు, ఈ స్టేజ్ పైన సందడి చేశావ్.. ఓ సారి నీ భర్త తో వచ్చావ్.. మరోసారి నీ మాజీ భర్తతో.. అంటూ నోరుజారారు.. వెంటనే క్షమించండి నీ మాజీ ప్రియుడితో వచ్చావ్ అంటూ సరి చేసుకున్నాడు కరణ్. అయితే మాజీ భర్త అనే పదం వినగానే కరీనా షాక్ అయ్యింది. అలాగే రణబీర్ , షాహిద్ ఈ ఇద్దరిలో నిన్ను ఎవరు పార్టీలకు ఇన్వైట్ చేయరు.? అని ప్రశ్నించగా షాహిద్ నన్ను పిలవకపోవచ్చు కానీ.. రణబీర్ పిలవకుండా ఉండడు అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!