Janhvi Sara: ఆ ఇద్దరు అన్నదమ్ములతో స్టార్ హీరోయిన్స్ డేటింగ్.. అసలు విషయం బయటపెట్టిన ప్రొడ్యూసర్..

మీ ఇద్దరి స్నేహం ఏ స్థాయిలో ఉందో నాకు తెలియదు. కానీ గతంలో మీరు అన్నదమ్ములైన ఇద్దరు వ్యక్తులతో డేటింగ్ లో ఉన్నారు కదా. అది నాకు గుర్తుంది.

Janhvi Sara: ఆ ఇద్దరు అన్నదమ్ములతో స్టార్ హీరోయిన్స్ డేటింగ్.. అసలు విషయం బయటపెట్టిన ప్రొడ్యూసర్..
Janhvi Sara

Updated on: Jul 16, 2022 | 4:37 PM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor), సారా అలీఖాన్ (Sara Alikhan) స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి కథానాయికలుగా అరంగేట్రం చేయకముందు నుంచి వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. తాజాగా వీరిద్దరి కలిసి ప్రముఖ రియాల్టీ షో కాఫీ విత్ కరణ్‏కు హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారి వ్యక్తిగత విషయాలు.. ఫ్రెండ్ షిప్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అయితే షో మధ్యలోనే జాన్వీకి, సారాకు షాకిచ్చాడు కరణ్. వారిద్దరికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు. దీంతో జాన్వీ, సారా ఒకింత షాకయ్యారు. గతంలో వీరిద్దరు అన్నదమ్ములతో కలిసి డేటింగ్ చేశారని వారు తమ బిల్డింగ్ లోనే నివాసం ఉండేవారని చెప్పుకొచ్చాడు. కరణ్ చెప్పిన విషయాలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

కాఫీ విత్ కరణ్ షోలో జాన్వీ, సారాను ఉద్దేశిస్తూ ” మీ ఇద్దరి స్నేహం ఏ స్థాయిలో ఉందో నాకు తెలియదు. కానీ గతంలో మీరు అన్నదమ్ములైన ఇద్దరు వ్యక్తులతో డేటింగ్ లో ఉన్నారు కదా. అది నాకు గుర్తుంది. ” అంటూ అసలు విషయం బయటపెట్టాడు కరణ్. దీంతో జాన్వీ , సారా షాక్ అయ్యారు. వెంటనే మళ్లీ కరణ్ స్పందిస్తూ.. ఆ ఇద్దరూ మా బిల్డింగ్ లోనే ఉండేవాళ్లు అంటూ చెప్పుకొచ్చారు. ఇక కరణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి. జాన్వీ, సారా డేటింగ్ చేసిన ఆ అన్నదమ్ములు ఎవరా ? అని వెతుకులాట ప్రారంభించారు నెటిజన్స్. గతంలో సారా, జాన్వీ ఓ ప్రముఖ రాజకీయ నేత మనవళ్లైన వీర్ పహారియా, శిఖర్ పహారియాతో డేట్ చేశారు. వీరికి సంబంధించిన ఫోటోస్ గతంలో తెగ వైరల్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.