Tejas Trailer: ఆకట్టుకుంటున్న యాక్షన్ థ్రిల్లర్ ‘తేజస్’ ట్రైలర్ .. ఫైర్ జెట్ పైలెట్‌గా కంగనా..
ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా మేకర్స్ ఈరోజు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. సర్వేష్ మేవారా దర్శకత్వం వహించిన తేజస్ అక్టోబర్ 27న విడుదల కానుంది. కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన టీజర్ మూవీపై మరింత ఆసక్తిని పెంచేసింది. టీజర్ అభిమానులలో ఉత్సాహాన్ని రేకెత్తించింది. యాక్షన్‌తో నిండిన ప్రపంచంలోని చిన్న భాగాన్ని చూపిస్తూనే.. ఇంతకు ముందెన్నడూ చూడని అనుభవంతో సినిమా ప్రేక్షకులకు అందించబోతున్నట్లు టీజర్ ద్వారా తెలియజేసింది చిత్రయూనిట్.

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం తేజస్. ఈ మూవీ మూడేళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటుంది. ఎట్టకేలకు ఈ సినిమా ఈ ఏడాది థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా మేకర్స్ ఈరోజు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. సర్వేష్ మేవారా దర్శకత్వం వహించిన తేజస్ అక్టోబర్ 27న విడుదల కానుంది. కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన టీజర్ మూవీపై మరింత ఆసక్తిని పెంచేసింది. టీజర్ అభిమానులలో ఉత్సాహాన్ని రేకెత్తించింది. యాక్షన్‌తో నిండిన ప్రపంచంలోని చిన్న భాగాన్ని చూపిస్తూనే.. ఇంతకు ముందెన్నడూ చూడని అనుభవంతో సినిమా ప్రేక్షకులకు అందించబోతున్నట్లు టీజర్ ద్వారా తెలియజేసింది చిత్రయూనిట్.
ఈ టీజర్‌లో కంగనా రనౌత్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ తేజస్ గిల్‌గా కనిపించనుందని, ఆమె దేశం కోసం పోరాడుతుందని తెలుస్తోంది. ఈ సినిమా బయోపిక్ కాదని నిర్మాతలు గతంలోనే ధృవీకరించారు. టీజర్ లాంచ్‌తో విడుదల తేదీని మారుస్తున్నామని.. దీంతో టైగర్ ష్రాఫ్ నటించిన గణపత్‌తో పోటీ ఉండదని టీమ్ వెల్లడించింది.
View this post on Instagram
మూడేళ్లుగా తేజస్ పైప్‌లైన్‌లో ఉంది. ఈ చిత్రాన్ని ముందుగా డిసెంబర్ 2020లో విడుదల చేయాలని నిర్ణయించారు. ఆగస్ట్ 2020లో సినిమా అసలు విడుదల తేదీని కంగనా ప్రకటించింది. ఆ సమయంలో, ప్రెస్‌కి ఇచ్చిన ప్రకటనలో, కంగనా మాట్లాడుతూ, “తేజస్ ఒక ఉత్తేజకరమైన కథ. ఇందులో నేను నటించే అవకాశం వచ్చింది. ఒక ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రలో కనిపించనున్నాను.. ప్రతిరోజూ విధి నిర్వహణలో అపారమైన త్యాగాలు చేసే యూనిఫాంలో ఉన్న ఈ ధైర్య పురుషులు & మహిళలను జరుపుకునే చిత్రంలో నేను భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాను. మా చిత్రం సాయుధ దళాలను, దాని హీరోలను జరుపుకుంటుంది.సర్వేష్, రోనీ (రోనీ స్క్రూవాలా, నిర్మాత)తో కలిసి ఈ ప్రయాణం చేయడానికి సంతోషిస్తున్నాము.” అంటూ చెప్పుకొచ్చింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
