బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని కాలికి తీవ్ర గాయమైంది. ఈ విషయాన్ని హృతిక్‌నే సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. ఇందులో నడుముకు ఒక బెల్ట్ కట్టుకుని వీల్ చైర్ లో ఊతకర్రల సాయంతో నిలుచున్నాడు హృతిక్. ‘గతంలో మీలో ఎంత మందికి ఈ క్రచెస్, ఊత కర్రలు అవసరమొచ్చింది? ఆ సందర్భంలో మీ ఫీలింగ్ ఏంటి? ‘ అని తన అభిమానులను అడిగాడీ స్టార్ హీరో. గాయంతో కలిగిన బాధ నుంచి ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు హృతిక్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో రాసుకొచ్చాడు. ఈ ఫొటోను చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. హీరోకు ఏమైందంటూ కామెంట్లు పెడుతున్నారు. టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్ తదితర స్టార్స్ కూడా హృతిక్‌కు మెసేజులు చేస్తున్నారు. హృతిక్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఫొటో చూస్తుంటే హృతిక్‌కు తీవ్రమైన గాయాలే అయ్యాయనిపిస్తోంది. అయితే ఇందుకు గల కారణాలను మాత్రం ఈ హీరో వెల్లడించలేదు. బహుశా ఫైటర్ సినిమా షూటింగ్ సమయంలో ఏమైనా దెబ్బలు తగిలి ఉండవచ్చని తెలుస్తోంది.
ప్రస్తుతం హృతిక్ పరిస్థితిని చూస్తుంటే కొన్ని రోజులైనా అతనికి విశ్రాంతి తప్పదని తెలుస్తోంది. ఇది క్రమంగా వార్2 షూటింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఇందులో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందనుంది. అయాన్ ముఖర్జీ తెరకెక్కించనున్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం తారక్ డేట్స్ కూడా ఇచ్చేశారు. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభమవుతుందనుకున్నారు ఫ్యాన్స్. అయితే ఇంతలోనే హృతిక్ రోషన్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వార్ 2 ప్రాజెక్టు మరింత ఆలస్యం కావొచ్చని తెలుస్తోంది.
Meet Patty – A #Fighter Pilot whose only allegiance is to his country. The sky is his playground, and his Sukhoi’s cockpit is his home. A fierce leader, an unwavering friend and an enemy to be feared. But most of all, he’s a Fighter Forever 🇮🇳 pic.twitter.com/pbDeErXT3d
— Hrithik Roshan (@iHrithik) February 7, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.