ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరో, హీరోయిన్లలో చాలామంది గతంలో ఛైల్డ్ ఆర్టిస్టులుగా నటించి మెప్పించిన వారే. ఈ హీరో కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. ఈ నటుడి తండ్రి భారతీయ సినిమా గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు. తన తండ్రి సినిమా వారసత్వాన్ని కొనసాగిస్తూ ఛైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదటి సినిమాలోనే ఏకంగా రజనీకాంత్, శ్రీదేవి లాంటి దిగ్గజ నటీనటులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత హీరోగానూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తనదైన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ తో అనతి కాలంలోనే స్టార్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా అమ్మాయిల మనసుల్లో ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. గ్రీకు వీరుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం భారతీయ సినిమా ఇండస్ట్రీలో ది మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో ఈ నటుడు కూడా ఒకరు. అంతేకాదు అత్యధిక పారితోషకం తీసుకునే హీరోల్లో కూడా టాప్ లోనే ఉన్నాడు. మరి అతనెవరో గుర్తు పట్టారా? పై ఫొటోలో శ్రీదేవితో ఉన్నది మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. శుక్రవారం (జనవరి 10) అతని పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు హృతిక్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అదే విధంగా ఈ గ్రీకు వీరుడు చిన్ననాటి ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
పై ఫొటో విషయానికి వస్తే.. 1986లో రజనీకాంత్ నటించిన భగవాన్ దాదా చిత్రంలో బాలనటుడిగా నటించాడు హృతిక్ రోషన్. ఈ సినిమాలో హీరోయిన్ గా అతిలోకసుందరి శ్రీదేవి నటించింది. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఇందులో రజనీ, శ్రీదేవీలతో పాటు పలువురు ప్రముఖ నటీనటులు యాక్ట్ చేశారు. హృతిక్ పుట్టిన రోజు నేపథ్యంలో మరోసారి ఈ సినిమా స్టిల్స్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
కాగా ఫైటర్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు హృతిక్ రోషన్. ప్రస్తుతం వార్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడీ సూపర్ స్టార్. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Happy Birthday 🎂 Most Complete Actor In This Planet Hrithik Roshan. @iHrithik#HrithikRoshan𓃵 #HappyBirthdayHrithikRoshan pic.twitter.com/qcbwPiSwGc
— Suraj sekh (@Surajsekh12) January 10, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.