ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ అనుభవిస్తోన్న సినీ తారల్లో చాలామంది గతంలో దక్షిణాది సినిమాల్లో నటించి సందడి చేసిన వారే. కొందరైతే ఇక్కడి సినిమాలతోనే వెండితెరకు పరిచయమయ్యారు. ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, దీపికా పదుకొణె.. లాంటి స్టార్ హీరోయిన్లు గతంలో పలు సౌత్ ఇండియన్ సినిమాల్లో సందడి చేశారు. ఫై ఫొటోలో ఉన్న హీరోయిన్ కూడా ఒక తెలుగు సినిమాలో నటించింది. అది కూడా స్టార్ హీరోతో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకుంది. అందులో ఈమె అందం, అభినయానికి మంచి మార్కులే పడ్డా సినిమా మాత్రం బోల్తాపడింది. దీంతో హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకోలేకపోయింది. అయితే ఎంచెక్కా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తన అదృష్టం పరీక్షించుకుంది. ఎంచెక్కా అక్షయ్‌కుమార్, రణ్‌బీర్ కపూర్, హృతిక్ రోషన్‌లాంటి స్టార్ హీరోలతో ఆడిపాడింది. యువహీరోలతోనూ కలిసి సినిమాలు చేసింది. ఇక సినిమాలతోనూ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ నిత్యం తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్న ఈ సొగసరి దానికి సంబంధించిన ఫొటోలను నెట్టింట్లో షేర్ చేసింది. క్షణాల్లోనే అవి వైరల్‌గా మారాయి. ఇందులో పొడవాటి తెల్లగౌనులో పాలరాతి శిల్పంలా మెరిసిపోయిందీ సదరు హీరోయిన్. ఇంతకీ బ్యూటీక్వీన్ ఎవరో గుర్తుపట్టారా?
ఈమె మరెవరో కాదు.. తెలుగులో నాని సరసన ఆమా కల్యాణంలో సందడి చేసిన వాణీ కపూర్. శుద్ధ్ దేశీ రొమాన్స్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ రణ్‌వీర్‌తో కలిసి బేఫిక్రే, హృతిక్ రోషన్‌తో కలిసి వార్, అక్షయ్ కుమార్‌తో కలిసి బెల్‌బాటమ్, రణ్‌బీర్ కపూర్‌తో కలిసి షంషేరా సినిమాల్లో నటించింది. అన్నట్లు బోల్డ్‌నెస్‌లో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించుకుందీ స్టార్ హీరోయిన్. ఆమె షేర్ చేసే హాట్ ఫొటోలకు నెటిజన్లు లైకులు, షేర్ల వర్షం కురిపిస్తుంటారు. ఇన్‌స్టాలో ఐదు మిలియన్లకుపైగా ఫాలోవర్స్‌ని సంపాధించుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరోసారి తన ఫ్యాషనబుల్ దుస్తులతో ఆహా అనిపించింది. వీటిని ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ మనీశ్ మల్హోత్రా రూపొందించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..