Sushmita Sen: లలిత్ మోడీతో డేటింగ్‌, పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సుస్మిత.. నాకు నచ్చిన చోట సంతోషంగా ఉన్నానంటూ..

Sushmita Sen - Lalit Modi: మాజీ మిస్‌యూనివర్స్‌, బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌తో డేటింగ్‌లో ఉన్నానంటూ మాజీ ఐపీఎల్‌ ఛైర్మన్‌ లలిత్‌ మోడీ (Lalit Modi) షేర్‌ చేసిన పోస్ట్‌ అటు సినిమా ఇండస్ట్రీ, ఇటు క్రికెట్‌ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. సుస్మితతో కొత్త జీవితం ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ..

Sushmita Sen: లలిత్ మోడీతో డేటింగ్‌, పెళ్లిపై  క్లారిటీ ఇచ్చిన సుస్మిత..  నాకు నచ్చిన చోట సంతోషంగా ఉన్నానంటూ..
Sushmita Sen Lalit Modi

Updated on: Jul 15, 2022 | 7:24 PM

Sushmita Sen – Lalit Modi: మాజీ మిస్‌యూనివర్స్‌, బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌తో డేటింగ్‌లో ఉన్నానంటూ మాజీ ఐపీఎల్‌ ఛైర్మన్‌ లలిత్‌ మోడీ (Lalit Modi) షేర్‌ చేసిన పోస్ట్‌ అటు సినిమా ఇండస్ట్రీ, ఇటు క్రికెట్‌ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. సుస్మితతో కొత్త జీవితం ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ, త్వరలో తాము పెళ్లికూడా చేసుకుంటామంటూ ఆయన షేర్‌ చేసిన ఫొటోలు నెట్టింట్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈక్రమంలో వారికి పెళ్లికూడా అయిపోయిందంటూ కొందరు శుభాకాంక్షలు కూడా తెలిపారు. దీంతో లలిత్‌ మోడీ తమకింకా పెళ్లవలేదని ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చాడు. తాజాగా సుస్మితాసేన్‌ (Sushmita Sen) సైతం ఈ డేటింగ్‌ విషయంపై స్పందించింది.

ఈ సందర్భంగా తన ఇద్దరు పిల్లలతో సరదాగా కలిసున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ బాలీవుడ్‌ నటి.. ‘ప్రస్తుతం నేను నాకు నచ్చిన ప్రదేశంలో ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇంకా ఉంగరాలు మార్చుకోలేదు, పెళ్లి కాలేదు.  ప్రేమలో మునిగి తేలుతున్నా.. ఈ క్లారిటీ సరిపోతుందనుకుంటా.. ఇక నా పని నేను చూసుకుంటా.. నా ఆనందాన్ని పంచుకునేవారికి థ్యాంక్యూ.. ఎవరైతే పంచుకోరో.. వారికి నా గురించి అవసరం లేదు.. ఏదేమైనా లవ్‌ యూ గయ్స్‌’ అని రాసుకొచ్చింది. అయితే ఈ పోస్ట్‌లో ఆమె ఎక్కడ కానీ లలిత్‌ మోడీ ప్రస్తావన తీసుకురాకపోవడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..