
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటుంది. కొన్ని రోజులుగా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరోయిన్స్ ఊర్వశి రౌతేలా, మాజీ ఎంపీ మిమి చక్రవర్తికి ఈడీ నోటీసులు పంపించింది. ప్రస్తుతం ఈ న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాను సెప్టెంబర్ 16న, మాజీ ఎంపీ మిమి చక్రవర్తిని సెప్టెంబర్ 15న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ ప్రధాన కార్యాలయం ముందు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. వీరిద్దరిని ఈడీ బృందం విచారించనుంది.
ఇవి కూడా చదవండి : Tollywood: అప్పుడు క్యాటరింగ్ బాయ్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు.. క్రేజ్ చూస్తే..
బెట్టింగ్ మొబైల్ యాప్ ప్రమోషన్ కోసం వారిద్దరినీ ప్రశ్నించి, వారు ఎలా, ఎప్పుడు డబ్బు అందుకున్నారో తెలుసుకోవాలని ED కోరుకుంటోంది. ఈ కేసులో ఇది పెద్ద మనీలాండరింగ్ కేసులో ఒక భాగం. ఈ కేసులో ఈడీ గతంలో అనేక మంది ఉన్నత స్థాయి వ్యక్తులను ప్రశ్నించింది. ఇటీవల, సెప్టెంబర్ 4న శిఖర్ ధావన్‌కు సమన్లు జారీ అయ్యాయి. ఆ సమయంలో, శిఖర్ ధావన్ PMLA చట్టం కింద తన వాంగ్మూలాన్ని నమోదు చేశాడు. ఆగస్టులో, సురేష్ రైనా కూడా ఢిల్లీలో హాజరై తన వాంగ్మూలాన్ని నమోదు చేశాడు.
ఇవి కూడా చదవండి : Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ సినిమాతో కుర్రాళ్ల హృదయాలు దొచుకున్న చిన్నది.. ఈ హీరోయిన్ గురించి తెలుసా.. ?
ఇదిలా ఉంటే.. రాబోయే రోజుల్లో మరికొంత మంది సినీతారలకు ఈడీ సమన్లు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ అక్రమ నెట్‌వర్క్ మొత్తాన్ని దాని మూలాల నుండి నిర్మూలించడం ఈడీ లక్ష్యంగా పెట్టుకుంది. మనీలాండరింగ్ కేసులో ప్రమేయం ఉన్న తారలకు ఈడీ నోటీసులు జారీ చేయనుంది.
ఇవి కూడా చదవండి : Cinema : ఇదెందయ్య ఇది.. ఓటీటీలో దూసుకుపోతుంది.. అయినా థియేటర్లలో కలెక్షన్స్ ఆగడం లేదు..
ఇవి కూడా చదవండి : Actors: ఇద్దరు అన్నదమ్ములు తెలుగులో క్రేజీ హీరోస్.. ఒకరు పాన్ ఇండియా.. మరొకరు టాలీవుడ్..