Sourav Ganguly Biopic: త్వరలో పట్టాలెక్కనున్న గంగూలీ బయోపిక్‌.. దాదాగా మెరవనున్న ఆ స్టార్‌ హీరో!

సౌరవ్ గంగూలీ దేశం చూసిన గొప్ప క్రికెటర్లో ఒకటరు. అభిమానులు ముద్దుగా 'దాదా' అని పిలుచుకునే లెజెండరీ ఆటగాడే భారత క్రికెట్‌ రూపు రేఖలను మార్చాడు. ముఖ్యంగా టీమిండియాకు దూకుడు అన్న పదాన్ని పరిచయం చేసింది గంగూలీనే. ప్లేయర్‌గా, కెప్టెన్‌గా భారత క్రికెట్‌కు సేవలందించిన సౌరవ్‌ రిటైర్మెంట్ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తన సొగసైన ఆటతీరుతో ప్రపంచ క్రికెట్‌లో రారాజుగా వెలుగొందిన సౌరవ్ గంగూలీ

Sourav Ganguly Biopic: త్వరలో పట్టాలెక్కనున్న గంగూలీ బయోపిక్‌.. దాదాగా మెరవనున్న ఆ స్టార్‌ హీరో!
Sourav Ganguly

Updated on: Sep 05, 2023 | 9:37 PM

సౌరవ్ గంగూలీ దేశం చూసిన గొప్ప క్రికెటర్లో ఒకటరు. అభిమానులు ముద్దుగా ‘దాదా’ అని పిలుచుకునే లెజెండరీ ఆటగాడే భారత క్రికెట్‌ రూపు రేఖలను మార్చాడు. ముఖ్యంగా టీమిండియాకు దూకుడు అన్న పదాన్ని పరిచయం చేసింది గంగూలీనే. ప్లేయర్‌గా, కెప్టెన్‌గా భారత క్రికెట్‌కు సేవలందించిన సౌరవ్‌ రిటైర్మెంట్ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తన సొగసైన ఆటతీరుతో ప్రపంచ క్రికెట్‌లో రారాజుగా వెలుగొందిన సౌరవ్ గంగూలీ బయోపిక్ రెడీ అవుతోంది. ఈ బయోపిక్‌లో గంగూలీ పాత్రలో చాక్లెట్‌ బాయ్‌ రణ్‌బీర్ కపూర్ కనిపించనున్నాడని తెలిసింది . అయితే ఇప్పుడు హీరో మారనున్నాడు. రణబీర్‌కు బదులు వర్సటైల్‌ హీరో ఆయుష్మాన్ ఖురానా నటిస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానాకు బాలీవుడ్‌ లో మంచి పాపులారిటీ ఉంది. తాజాగా అతను ‘డ్రీమ్ గర్ల్ 2’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. దీంతో తన తర్వాతి ప్రాజెక్టులపై పూర్తి దృష్టి సారించాడు ఆయుష్మాన్‌. మరోవైపు గంగూలీ బయోపిక్‌లో రణ్‌బీర్‌ కపూర్‌ని కాకుండా ఆయుష్మాన్‌ని హీరోగా ఎంపిక చేసేందుకు చిత్రబృందం చాలా ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ‘డ్రీమ్ గర్ల్ 2’ సక్సెస్‌ తర్వాత ఆయుష్మాన్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ సౌరవ్‌ గంగూలీ బయోపిక్‌ గురించి నేను ఏమీ చెప్పలేను. ఏది ఏమైనా అధికారికంగా తెలియజేయాలి’ అని మాట దాటేశారు.

ఇదే ఇంటర్వ్యూలో ఆయుష్మాన్‌ని డ్రీమ్ గర్ల్ 3 గురించి అడిగారు. దీనిపై అతను మాట్లాడుతూ.. ”ప్రస్తుతం దీని గురించి ఎలాంటి సమాచారం లేదు. దీని గురించి చిత్ర దర్శకుడు రాజ్ శాండిల్యతో మాట్లాడవచ్చు. అతనికి డ్రీమ్ గర్ల్ 3 కోసం ఆలోచన ఉంటే, నేను ఖచ్చితంగా దీన్ని చేయాలనుకుంటున్నాను. కాగా డ్రీమ్ గర్ల్ 2 గదర్ 2, OMG 2 వంటి రెండు భారీ సినిమాల మధ్య థియేటర్లలో విడుదలైంది. అయినా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 116 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు.. ఈ చిత్రంలో ఆయుష్మాన్ సరసన అనన్య పాండే నటించింది. పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, విజయ్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో ఆడ గొంతుతో మాట్లాడి అందరినీ ఆటపట్టించే వ్యక్తిగా ఆయుష్మాన్‌ అద్భుతంగా నటించాడు.

ఇవి కూడా చదవండి

రణ్ బీర్ ప్లేసులో ఆయుష్మాన్ ఖురానా..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..