AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2021: బెంగుళూరులో దీపావళి… గుర్తుకొస్తున్నాయంటున్న బాలీవుడ్ నటి దీపిక పదుకోన్‌

Diwali 2021: దీపావళి అనగానే ఎవరికైనా చిన్ననాటి రోజులు ఇట్టే గుర్తుకొచ్చేస్తాయి. ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి కాల్చిన కాకరవత్తులు, లక్ష్మీ టపాసులు, భూచక్రాలు, తారాజువ్వలు...

Diwali 2021: బెంగుళూరులో దీపావళి... గుర్తుకొస్తున్నాయంటున్న బాలీవుడ్ నటి దీపిక పదుకోన్‌
Deepika Padukone
Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Janardhan Veluru|

Updated on: Nov 01, 2021 | 2:40 PM

Share

దీపావళి అనగానే ఎవరికైనా చిన్ననాటి రోజులు ఇట్టే గుర్తుకొచ్చేస్తాయి. ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి కాల్చిన కాకరవత్తులు, లక్ష్మీ టపాసులు, భూచక్రాలు, తారాజువ్వలు… అబ్బాయిలైతే హండ్రడ్‌ వాలాస్‌, థౌజండ్‌ వాలాస్‌, బాంబులు, … అబ్బో ఆ సందడి మామూలుగా ఉండదు. మామూలుగా నలుగురం కలిసినప్పుడు మనమే ఇన్ని మాట్లాడుకుంటుంటే, సెలబ్రిటీలు తమ లైఫ్‌లో జరిగిన విషయాలను చెబుతుంటే ఇంకా చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తుంది కదా!

ఇప్పుడు అలాంటి ఆసక్తికరమైన అంశాలనే షేర్‌ చేసుకున్నారు ప్రభాస్‌ నెక్స్ట్ మూవీ హీరోయిన్‌ దీపిక పదుకోన్‌. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్యాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కెలో హీరోయిన్‌గా నటిస్తున్న దీపిక పదుకోన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

నార్త్ లో సెటిల్‌ అయినప్పటికీ దీపిక పదుకోన్‌ బాల్యం అంతా బెంగుళూరు లోనే గడిచింది. చిన్న తనంలో దీపావళి వస్తుందంటే సందడి మామూలుగా ఉండేది కాదట. బిల్డింగ్‌లో ఉన్న మిగిలిన పిల్లలు అందరితో కలిసి కిందికి దిగి టపాసులు కాల్చేవారట దీపిక. ఆ రోజు స్వీట్లతో పండుగ మామూలుగా ఉండేది కాదట. అంతే కాదు, ఎవరు ఎప్పుడు దీపావళి గురించి ప్రస్తావించినా, ఇంట్రస్టింగ్‌ విషయం గుర్తుకొస్తుందని చెబుతున్నారు దీపిక. వాళ్ల ఇంట్లో అందరి పేర్లకూ దీపావళితో కనెక్షన్‌ ఉందనేది ఆమె మాట. దీపిక తల్లి పేరు ఉజ్వల పదుకోన్‌, తండ్రి ప్రకాష్‌ పదుకోన్‌, సోదరి అనిశ పదుకోన్‌.. ఇలా అందరి పేర్లకూ వెలుగుతో కనెక్షన్‌ ఉండటం గురించి అప్పుడప్పుడూ తమ మధ్య సరదా కాన్వర్జేషన్‌ కూడా ఉంటుందని అన్నారు దీపిక.

ఎప్పుడూ దీపావళి పార్టీ గ్రాండ్‌గా అరేంజ్‌ చేసే దీపిక పదుకోన్‌, గత ఏడాది మాత్రం సన్నిహితుల మధ్య సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ సారి ముంబైలో కాస్త గ్రాండ్‌ గానే ప్లాన్‌ చేస్తున్నారు. కెరీర్‌ ఫ్రెంట్‌ రణ్‌ వీర్‌ సింగ్‌తో కలిసి దీపిక పదుకోన్‌ నటించిన 83 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. ఇప్పుడు సెట్స్ మీద హృతిక్‌ రోషన్‌తో కలిసి నటిస్తున్న ఫైటర్‌ ఉంది. అలాగే షకున్ బాత్రా సినిమా కూడా షూటింగ్‌ పెండింగ్‌లో ఉంది. ప్రభాస్‌ మూవీ ఎలాగూ ప్యాన్‌ వరల్డ్ రేంజ్‌లో ఉంటుంది.

ఇంకో రెండేళ్లలో పేరెంటింగ్‌కి ప్రిపేర్‌ అవుతున్నట్టు ఆల్రెడీ రణ్‌వీర్‌ ఓ సందర్భంలో చెప్పారు. సో దీపిక అటు ప్రెగ్నెన్సీకి కూడా ఇప్పటి నుంచే ప్లానింగ్‌లో ఉన్నారన్నమాట.

Also Read..

Chiranjeevi: దెయ్యం​ లుక్​లో మెగాస్టార్.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో.. Watch

Sunny Leone Halloween celebrations: సన్నీ లియోన్ ఇంట్లో హాలోవీన్ వేడుకలు… సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోస్…