Sandeep Reddy Vanga: నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా.. ఆ నటుడికి డైరెక్టర్ సందీప్ కౌంటర్..

ఇదే చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రూపొందించారు. ఆ తర్వాత కొన్నాళ్లకే బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్‏తో యానిమల్ చిత్రాన్ని తెరకెక్కించారు. గతేడాది విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు అడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా.. సినీ ప్రమఖులు, క్రిటిక్స్ మాత్రం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Sandeep Reddy Vanga: నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా.. ఆ నటుడికి డైరెక్టర్ సందీప్ కౌంటర్..
Sandeep Reddy Vanga
Follow us
Rajitha Chanti

| Edited By: TV9 Telugu

Updated on: May 11, 2024 | 3:39 PM

డైరెక్టర్ సందీప్ రెడ్డి.. ఇప్పుడు ఈ పేరు తెలియని సినీ ప్రేమికుడు ఉండరు. తన సినిమాలతో బాక్సాఫీస్ షేక్ చేయడం ఆయనకు అలవాటే. అలాగే విమర్శలు, ప్రశంసలు కూడా సందీప్ సినీ ప్రయాణంలో కొత్తేమి కాదు. తన చిత్రాలపై ఎవరెన్ని కామెంట్స్ చేసినా అంతగా పట్టించుకోరు. కొన్నిసార్లు మాత్రం తనదైన స్టైల్లో విమర్శలకు కౌంటర్స్ ఇస్తుంటారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండకు హీరోగా కెరీర్ టర్నింగ్ పాయింట్ ఇచ్చిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు సందీప్. ఇదే చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రూపొందించారు. ఆ తర్వాత కొన్నాళ్లకే బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్‏తో యానిమల్ చిత్రాన్ని తెరకెక్కించారు. గతేడాది విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు అడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా.. సినీ ప్రమఖులు, క్రిటిక్స్ మాత్రం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇందులో నెగిటివిటీ ఎక్కువగా ఉందని.. చెత్త సినిమా అంటూ విరుచుకుపడ్డారు. ఇక యానిమల్ మూవీపై కామెంట్స్ చేసిన అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు, రచయిత జావేద్ అక్తర్ కు కౌంటరిచ్చారు సందీప్.

ఇక ఇప్పుడు బాలీవుడ్ నటుడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సందీప్. అతడిని తన సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నానని చురకలు అంటించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. బాలీవుడ్ నటుడు అదిల్ హుస్సేన్ డైరెక్టర్ సందీప్ తెరకెక్కించిన కబీర్ సింగ్ సినిమాలో కాలేజీ ప్రిన్సిపాల్ పాత్రలో నటించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అదిల్ మాట్లాడుతూ.. కబీర్ సింగ్ సినిమా చేసినందుకు పశ్చా్త్తాపడుతున్నానని అన్నారు. ఆ పాత్ర చేయకుండా ఉండాల్సిందని అన్నారు. “కబీర్ సింగ్ సినిమాలో నేను పోషించిన పాత్ర, సీన్ మంచిదే.. కానీ సినిమానే కాదు.. నాకు కథ తెలియకుండా నటించాను. రిలీజ్ అయ్యాక చూసి మధ్యలోనే వచ్చేసాను. ఇలాంటి సినిమానా నేను చేసింది అని ఫీల్ అయ్యాను. కబీర్ సింగ్ మూవీ చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాను. ఇలాంటి మూవీ చూడమని ఎవరిని సజెస్ట్ చేయను. మా భార్యకు చెప్తే నన్ను తిడుతుంది ఇలాంటి సినిమా చేసినందుకు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అతడి మాటలపై సందీప్ గట్టిగానే రియాక్ట్ అయ్యారు.

అదిల్ హుస్సేన్ మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ.. “మీరు గొప్పగా భావించి నటించిన 30 సినిమాలలో రాని గుర్తింపు .. ఎందుకు నటించానా ? అని ఫీలవుతున్న ఈ బ్లాక్ బస్టర్ తో మీ సొంతమైంది. అందుకు మీరు పశ్చాత్తాపడుతున్నారా ?.. మిమ్నల్ని నా సినిమాలో పెట్టుకున్నందుకు ఇప్పుడు నేను పశ్చాత్తాపపడుతున్నాను. మీ ఫ్యాషన్ కంటే మీ దురాశ పెద్దది. నేను మీ ముఖాన్ని AI సాయంతో మార్చి మీరు సిగ్గుపడకుండా నేను కాపాడతాను.. అప్పుడు హ్యాపీగా నవ్వుకోండి” అంటూ కౌంటరిచ్చాడు. ప్రస్తుతం సందీప్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.