AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: బాక్సాఫీస్‏ను షేక్ చేసిన హీరోయిన్.. కట్ చేస్తే.. ప్రియుడి ఇంటి ముందు శవమై.. ఇప్పటికీ వీడని మిస్టరీ..

జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొని.. చివరకు దారణ స్థితిలో మరణించిన సినీ తారలు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో బాక్సాఫీస్‏ను షేక్ చేసిన హీరోయిన్ ఆ తర్వాత ప్రియుడి ఇంటి ముందు దారణ హత్యకు గురైంది. ఆమె మరణించి దశాబ్దాలు గడుస్తున్నా.. ఇప్పటికీ వీడని మిస్టరీగానే మిగిలిపోయింది. ఆమె పేరు ప్రియా రాజ్ వంశ్. అప్పట్లో ఆమె మరణం యావత్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది.

Tollywood: బాక్సాఫీస్‏ను షేక్ చేసిన హీరోయిన్.. కట్ చేస్తే.. ప్రియుడి ఇంటి ముందు శవమై.. ఇప్పటికీ వీడని మిస్టరీ..
Priya Rajvansh
Rajitha Chanti
|

Updated on: Apr 18, 2024 | 6:11 PM

Share

సినీ పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం. నటీనటులుగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుని అగ్రస్థానంలో వెలిగిన తారల జీవితం తెర వెనుక కటిక చీకటిగానే ఉంటుంది. తెరపై చిరునవ్వుతో కనిపించిన కొందరి ముఖాలు నిజజీవితంలో ఎంతో దుఃఖంతో కనిపిస్తాయి. జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొని.. చివరకు దారణ స్థితిలో మరణించిన సినీ తారలు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో బాక్సాఫీస్‏ను షేక్ చేసిన హీరోయిన్ ఆ తర్వాత ప్రియుడి ఇంటి ముందు దారణ హత్యకు గురైంది. ఆమె మరణించి దశాబ్దాలు గడుస్తున్నా.. ఇప్పటికీ వీడని మిస్టరీగానే మిగిలిపోయింది. ఆమె పేరు ప్రియా రాజ్ వంశ్. అప్పట్లో ఆమె మరణం యావత్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది.

ప్రియా 1936 డిసెంబర్ 30న సిమ్లాలో జన్మించింది. ఆమె అసలు పేరు వేరా సుందర్ సింగ్. లండన్‏లో చదువుతున్న సమయంలో ఆమె ఫోటోను చూసి సినిమాల్లోకి అవకాశం వచ్చింది. రణవీర్ సింగ్ అనే వ్యక్తి ప్రియను దేవ్ ఆనంద్ సోదరుడు చేతన్ ఆనంద్‌కు పరిచయం చేశాడు. చేతన్ ఆనంద్ 1964లో వచ్చిన ‘హకీకత్’ చిత్రంలో ప్రియను ఎంపిక చేశారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో చేతన్, ప్రియల మధ్య స్నేహం పెరిగింది. అప్పటికే భార్యతో మనస్పర్థల కారణంగా విడిగా ఉంటున్న చేతన్ ఆనంద్ ప్రియతో ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత ప్రియాను మరో డైరెక్టర్ సినిమాల్లో నటించనివ్వలేదు. అలాగే తన అన్ని సినిమాల్లోనూ ప్రియాకు అవకాశం కల్పించాడు. 1970లో రాజ్ కుమార్ తో ప్రియా నటించిన హీరా రంజా సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ప్రియ కెరీర్ మలుపు తిరిగింది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో హిట్స్ ఖాతాలో వేసుకుంది.

ప్రియా, ఆనంద్ పెళ్లి చేసుకోకుండానే చాలా సంవత్సరాలపాటు సహజీవనం చేశారు. ప్రియా కంటే చేతన్ ఆనంద్ 15 సంవత్సరాలు పెద్ద. అప్పటికే చేతన్ ఆనంద్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు. 1997లో చేతన్ ఆనంద్ మృతి చెందాడు. మరణానికి ముందు తన ఇద్దరు కుమారులతోపాటు ప్రియాకు సైతం సగం ఆస్తిని అందించాడు చేతన్ ఆనంద్. చేతన్ ఆనంద్ మరణం తర్వాత అతడి కుమారులతో ప్రియా సన్నిహితంగానే ఉండేది. అయితే అనుకోకుండా 2000 మార్చి 27న ప్రియా మృతదేహం ముంబై జుహులోని చేతన్ ఆనంద్ ఇంటి సమీపంలో కనిపించింది. అప్పట్లో ఆమె మరణం ఇండస్ట్రీలో సంచనలం సృష్టించిచంది. ప్రియాను గొంతు నులిమి హత్య చేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. అయితే ప్రియా హత్య ఘటనలో ఆమె ప్రియుడు చేతన్ ఆనంద్ కుమారులు కేతన్, వివేక్ హస్తం ఉన్నట్లు విచారణలో తేలింది. వీరిద్దరు తమ సన్నిహితులు మరో ఇద్దరితో కలిసి ప్రియా హత్యకు పాల్పడ్డారని తేలడంతో వారికి జీవిత ఖైదు విధించింది కోర్టు. కానీ అదే ఏడాదిలో 2002లో వీరి బెయిల్ పై బయటకు వచ్చారు. దీంతో ఇప్పటికీ ప్రియా మృతి కేసు కొనసాగుతుంది.

Follow Us