AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shilpa Shetty: శిల్పాశెట్టి దంపతులకు ఈడీ షాక్.. రూ.98 కోట్ల ఆస్తులు జప్తు..

మహారాష్ట్రలో నమోదైన వివిధ ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. 2017లో రాజ్ కుంద్రా తన స్నేహితులతో కలిసి బిట్ కాయిన్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అంటూ అమాయక ప్రజలను మోసం చేసి దాదాపు రూ. 6600 కోట్లు సంపాదించారు. బిట్ కాయిన్ ద్వారా పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని ప్రజలను నమ్మించాడు.

Shilpa Shetty: శిల్పాశెట్టి దంపతులకు ఈడీ షాక్.. రూ.98 కోట్ల ఆస్తులు జప్తు..
Shilpa Shetty, Raj Kundra
Rajitha Chanti
|

Updated on: Apr 18, 2024 | 3:17 PM

Share

బాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోయిన్ శిల్పాశెట్టి దంపతులు మరోసారి చిక్కుల్లో పడ్డారు. క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్‏కు సంబంధించిన మనీలాండరింగ్ మోసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. ఈ కేసులో భాగంగా శిల్పాశెట్టి దంపతులకు సంబంధించిన దాదాపు రూ. 98 కోట్లు విలువైన ఆస్తులును ఈడీ సీజ్ చేసింది. ముంబైలోని జుహులోని ఫ్లాట్, పూణేలోని బంగ్లాతోపాటు రాజ్ కుంద్ర పేరుతో ఉన్న ఈక్విటీ షేర్లను ఈడీ జప్తు చేసింది. మహారాష్ట్రలో నమోదైన వివిధ ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. 2017లో రాజ్ కుంద్రా తన స్నేహితులతో కలిసి బిట్ కాయిన్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అంటూ అమాయక ప్రజలను మోసం చేసి దాదాపు రూ. 6600 కోట్లు సంపాదించారు. బిట్ కాయిన్ ద్వారా పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని ప్రజలను నమ్మించాడు. తీరా డబ్పులు చేతికి వచ్చాకా ఇన్వెస్టర్లను ్మోసం చేశాడు. దీనిపై మహరాష్ట్ర, ఢిల్లీ ప్రాంతాల్లో ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి.

రాజ్ కుంద్రా తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం బిట్‌కాయిన్ స్కామ్ చేశాడని.. ఇది ఒక రకమైన పోంజీ స్కీమ్ అని ఆరోపణలు వచ్చాయి. ఈ భారీ స్కామ్‌కు రాజ్‌ కుంద్రా ప్రధాన సూత్రధారి అని.. అమిత్ భరద్వాజ్ (2022లోనే మరణించాడు) ఇన్వెస్టర నుంచి దాదాపు 285 బిటి కాయిన్స్ కొనుగోలు చేశాడు. వీటితో ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్ మైనింగ్‌లో పెట్టుబడులు పెట్టాలని భావించాడు. ప్రస్తుతం రాజ్ కుంద్రా వద్ద ఉన్న 285 బిట్ కాయిన్ల విలువ రూ.150 కోట్ల కంటే ఎక్కువ. ఈ కేసులో ఈడీ చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసింది. ఇందులో నిందితుడిగా ఉన్న సింపి భరద్వాజ్‌ను 17 డిసెంబర్ 2023న, నితిన్ గౌర్‌ను 29 డిసెంబర్ 2023న అఖిల్ మహాజన్ 16 జనవరి 2023న అరెస్టు చేశారు. ప్రస్తుతం అందరూ జైల్లోనే ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు అజయ్ భరద్వాజ్, మహేంద్ర భరద్వాజ్ ఇంకా పరారీలో ఉన్నారు. ఇడి అతని కోసం అన్వేషణలో నిమగ్నమై ఉంది. ఈ కేసులో ఈడీ ఇప్పటికే రూ.69 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను జప్తు చేసింది.

ఈడీ దర్యాప్తు అనంతరం శిల్పాశెట్టి తరపు న్యాయవాది ప్రశాంత్ పాటిల్ ఒక ప్రకటన విడుదల చేశారు. న్యాయపరమైన ప్రక్రియను అనుసరిస్తామని చెప్పారు. మనీలాండరింగ్ చట్టం కింద తన క్లయింట్ల (రాజ్ కుంద్రా-శిల్పా శెట్టి) రక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటానని లాయర్ చెప్పారు. తన ఖాతాదారులపై ప్రాథమికంగా ఎలాంటి కేసును నమోదు చేయలేదని.. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.