భర్త సినిమాలో గెస్ట్ రోల్ చేయనున్న స్టార్ హీరోయిన్.. అందుకోసం ప్లాన్ చేస్తున్న డైరెక్టర్..
బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణ్వీర్ సింగ్ మరియు దీపిక పదుకునేలకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. వీరిద్దరు కలిసి నటించిన సినిమాలు
బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణ్వీర్ సింగ్ మరియు దీపిక పదుకునేలకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. వీరిద్దరు కలిసి నటించిన సినిమాలు సూపర్ హిట్ సాధించాయి. స్క్రీన్ పై వీరిద్ధరి కాంబినేషన్‌ను మళ్ళీ మళ్ళీ చూడాలని ఎదురుచూస్తుంటారు అభిమానులు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి నటించిన 83 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా.. అటు రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో దీపిక ఓ కీలక పాత్రలో నటించనున్నట్లుగా బీటౌన్లో టాక్ వినిపిస్తోంది.
రోహిత్ శెట్టి, రణ్వీర్ సింగ్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు సర్కస్ అనే టైటిల్‌ను ఖరారు చేసింది చిత్రయూనిట్. ఇందులో రణ్వీర్ సింగ్ సరసన పూజా హెగ్డే మరియు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు మరింత ఫాలోయింగ్ పెంచెందుకు దీపికను ఓ కీలక పాత్రలో నటించేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. అయితే నిజంగానే ఇందులో దీపిక నటిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: బాలయ్య సినిమాలో కన్నడ స్టార్ హీరో..? పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్న పునీత్ రాజ్.