VarunDhawan: నార్మల్‌గా హీరోయిన్లే సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్‌గా ఉంటారు. పర్సనల్ వ్యూస్‌తో పాటు రీల్స్, వీడియోస్ లాంటివి షేర్ చేసే అలవాటు కూడా వాళ్లకే కాస్త ఎక్కువ. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్స్ తో, రకరకాల వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటారు హీరోయిన్స్. కానీ రీసెంట్ టైమ్స్‌లో హీరోలు కూడా మేము సైతం అంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ అవ్వటమే కాదు.. అందాల భామలకు పోటిగా రీల్స్‌తో హల్‌చల్ చేస్తున్నారు.ఈ లిస్ట్‌లో అందరికంటే ముందే ఉన్నారు బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్. డోంట్ రష్ ఛాలెంజ్ అంటూ ఓ డ్యాన్స్ వీడియో షేర్ చేసిన విక్కీ.. మరింత మంది హీరోలకు ఇన్సిపిరేషన్‌గా నిలిచారు. సోషల్ మీడియా రీల్స్ విషయంలో మరింత యాక్టివ్‌గా ఉండే మరో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్. రెగ్యులర్‌గా ఫోటో షూట్ ఫోటోస్‌తో పాటు డ్యాన్స్ వీడియోస్‌ను కూడా షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు ఈ చాక్లెట్ బాయ్.
రీసెంట్‌గా ఈ లిస్ట్‌లోకి మరో హీరో కూడా ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ స్టార్ కిడ్ వరుణ్ ధావన్ ఫస్ట్ టైమ్ ఓ డ్యాన్స్ రీల్ చేశారు. డ్యాన్స్ చేయడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు అంటూ ఓ వార్మప్ సాంగ్‌కు కాలు కదిపారు.. ఈ వీడియో ఇప్పుడు ఇన్‌స్టా ట్రెండ్స్‌ను రూల్ చేస్తోంది. మరి ఆ వీడియో మీద మీరు కూడా ఓ లుక్కేసేయండి.
మరిన్ని ఇక్కడ చదవండి :