Swara Bhasker: త్వరలోనే అమ్మను కాబోతున్నా..శుభవార్త చెప్పిన ప్రముఖ నటి.. బేబీ బంప్‌ ఫొటోస్‌ వైరల్‌

|

Jun 07, 2023 | 12:05 AM

ప్రముఖ బాలీవుడ్‌ నటి స్వరా భాస్కర్‌ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ప్రారంభంలో పెళ్లిపీటలెక్కిన ఆమె త్వరలో తల్లిని కాబోతున్ననంటూ తెలిపింది. ఈ మేరకు తన బేబీ బంప్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అవి కాస్తా వైరలవుతున్నాయి. భర్త ఒడిలో కూర్చున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన స్వరా భాస్కర్‌..

Swara Bhasker: త్వరలోనే అమ్మను కాబోతున్నా..శుభవార్త చెప్పిన ప్రముఖ నటి.. బేబీ బంప్‌ ఫొటోస్‌ వైరల్‌
Actress Swara Bhaskar
Follow us on

ప్రముఖ బాలీవుడ్‌ నటి స్వరా భాస్కర్‌ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ప్రారంభంలో పెళ్లిపీటలెక్కిన ఆమె త్వరలో తల్లిని కాబోతున్ననంటూ తెలిపింది. ఈ మేరకు తన బేబీ బంప్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అవి కాస్తా వైరలవుతున్నాయి. భర్త ఒడిలో కూర్చున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన స్వరా భాస్కర్‌.. ‘కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనలని ఆలకించి ఫలించేలా చేస్తాడు. మేం కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం. ఏదో తెలియని గొప్ప అనుభూతితో పాటు చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాం’ అంటూ గుడ్‌న్యూస్‌ను షేర్‌ చేసింది. ఈ పోస్టుకు #Octoberbaby అనే హ్యాష్‌ ట్యాగ్‌ను కూడా ఇవ్వడంతో అక్టోబర్‌లోనే ఆమె తల్లిగా ప్రమోషన్‌ పొందనుందని హింట్‌ ఇచ్చింది. ప్రస్తుతం స్వరా ప్రెగ్నెన్సీ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చాలామంది స్వరా దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపగా.. కొందరు మాత్రం ఫిబ్రవరిలో పెళ్లి.. ఇప్పుడు ప్రెగ్నెంట్.. అక్టోబర్‌లో బేబీ ఏంటి? అంటూ లెక్కలు చెబుతూ స్వరాను ట్రోల్‌ చేస్తున్నారు.

కాగా బిహార్‌కు చెందిన స్వరా భాస్కర్‌ బాలీవుడ్‌లో ట్యాలెంటెడ్‌ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 2009లో ‘మధోలాల్ కీప్ వాకింగ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె సుమారు 20కు పైగా చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ల్లో నటించి మెప్పించింది. అయితే సినిమాలతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తోందీ అందాల తార. ఈ ఏడాది ప్రారంభంలో సమాజ్‌ వాదీ పార్టీ నేతను ఫహాద్ జిరార్ అహ్మద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది స్వరా భాస్కర్‌. అయితే ఫస్ట్‌ నైట్‌ ఫొటోస్‌ షేర్‌ చేసి మరోసారి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ప్రస్తుతం బేబీ బంప్‌తో ఉన్న ఫొటోని షేర్ చేసి.. తాను తల్లికాబోతున్న శుభవార్తను పంచుకుంది.

ఇవి కూడా చదవండి

 

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..