AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Animal Park: రెండు కాదు మూడు.. ‘యానిమల్’ సీక్వెల్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?

సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాకు రికార్డు కలెక్షన్లతో పాటు వివాదాలు కూడా వచ్చాయి. ఇందులో హింస మోతాదుకు మించి ఉందని, మహిళలను మరీ అవహేళన చేస్తూ చూపించారని కొందరు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పై విమర్శలు గుప్పించారు.

Animal Park: రెండు కాదు మూడు.. 'యానిమల్' సీక్వెల్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
Animal Park
Basha Shek
|

Updated on: Jan 28, 2026 | 7:38 AM

Share

బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ సినిమా 2023లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది.బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 900 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అయితే ఈ యానివల్ సినిమా విజయంతో పాటు వివాదాలను కూడా ఎదుర్కొంది. ఈ సినిమాలో హింస ఎక్కువగా ఉంది. పురుషాధిక్యత కనిపిస్తోంది. మహిళలను తక్కువగా చేసి చూపించారని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పై విమర్శలు వచ్చాయి. అయితే ఈ డైనిమిక్ డైరెక్టర్ ఈ విమర్శలను పట్టించుకోలేదు. అంతేకాదు ‘యానిమల్’ సినిమాకి సీక్వెల్ తీస్తానని కూడా ప్రకటించాడు. ఇప్పుడీ క్రేజీ ప్రాజెక్టు గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది. హీరో రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’ సీక్వెల్ షూటింగ్ గురించి మాట్లాడాడు. ‘దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం మరో సినిమా (ప్రభాస్ స్పిరిట్) బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తయిన తర్వాత, ‘యానిమల్ పార్క్’ ప్రారంభమవుతుంది. బహుశా ఈ సినిమా షూటింగ్ 2027లో ప్రారంభం కావచ్చు’ అని చెప్పుకొచ్చాడు రణ్ బీర్ కపూర్.

ఇవి కూడా చదవండి

సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి ‘స్పిరిట్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ చిత్రం తర్వాత రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ‘యానిమల్ పార్క్’ చిత్రాన్ని ప్రారంభిస్తారు. కాగా ‘యానిమల్’ చిత్రం చివర్లో ‘యానిమల్ పార్క్’ చిత్రం గురించి హింట్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా. అంతేకాదు మొదటి పార్ట్ కంటే రెండో భాగం మరింత వయలెంట్ గా ఉంటుందని కూడా చెప్పారు. ఇక ప్రస్తుతం రణబీర్ కపూర్ ‘రామాయణం’ సినిమాతో బిజీగా ఉన్నాడు. దీనితో పాటు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ‘లవ్ అండ్ వార్’ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ‘రామాయణం’ సినిమా మొదటి భాగం నవంబర్ 06న విడుదల కానుంది. ఆ తర్వాత ‘లవ్ అండ్ వార్’ సినిమా ఫిబ్రవరి 2027లో విడుదల కానుంది. దీని తర్వాత రణబీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్ర 2’, ‘యానిమల్ పార్క్’ సినిమాల్లో నటిస్తారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'యానిమల్' సీక్వెల్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
'యానిమల్' సీక్వెల్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
డేంజరస్ బంతికి క్లీన్‌బౌల్డ్.. కట్‌చేస్తే.. ట్విస్ట్ చూస్తే షాకే
డేంజరస్ బంతికి క్లీన్‌బౌల్డ్.. కట్‌చేస్తే.. ట్విస్ట్ చూస్తే షాకే
FTUతో ఒక్క రోజులో రూ.18 వేల కోట్ల నష్టం!
FTUతో ఒక్క రోజులో రూ.18 వేల కోట్ల నష్టం!
అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్ జైత్రయాత్ర..సూపర్-6లో బోణీ అదిరింది
అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్ జైత్రయాత్ర..సూపర్-6లో బోణీ అదిరింది
ఆఫీస్ బ్యాగ్‌లో ఇవి ఉంటే దరిద్రమే.. మీ కెరీర్ బాగుండాలంటే వెంటనే
ఆఫీస్ బ్యాగ్‌లో ఇవి ఉంటే దరిద్రమే.. మీ కెరీర్ బాగుండాలంటే వెంటనే
అర్జిత్ సింగ్ ఒక్కో సాంగ్‌కు ఎంత తీసుకుంటాడు? మొత్తం ఆస్తులెంత?
అర్జిత్ సింగ్ ఒక్కో సాంగ్‌కు ఎంత తీసుకుంటాడు? మొత్తం ఆస్తులెంత?
ఈసారి అన్ని ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లపై QR కోడ్‌.. ఎందుకంటే?
ఈసారి అన్ని ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లపై QR కోడ్‌.. ఎందుకంటే?
రెండు విడతల్లో కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు..
రెండు విడతల్లో కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు..
మొబైల్ హ్యాక్ అవ్వకుండా గూగుల్ క్రోమ్‌లో ఈ సెట్టింగ్స్ చేసుకోండి
మొబైల్ హ్యాక్ అవ్వకుండా గూగుల్ క్రోమ్‌లో ఈ సెట్టింగ్స్ చేసుకోండి
ఆ 30 నిమిషాలు సంజూ శాంసన్ రాత మారుస్తుందా?
ఆ 30 నిమిషాలు సంజూ శాంసన్ రాత మారుస్తుందా?