Anil Kapoor: బోనీ, అనిల్ , సంజయ్ ల తల్లి నిర్మల కపూర్ అనారోగ్యంతో మృతి..
అనిల్ కపూర్, సంజయ్ కపూర్, బోనీ కపూర్ ల తల్లి నిర్మల్ కపూర్ శుక్రవారం (మే 2) ముంబైలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యాల కారణంగా నిర్మల కపూర్ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్న నిర్మల ఈ రోజు సాయంత్రం 5:45 గంటలకు తుది శ్వాస విడిచినట్లు సమాచారం ఆమె వయస్సు 90 సంవత్సరాలు.

బాలీవుడ్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ తల్లి నిర్మల కపూర్ మరణించారు. బాలీవుడ్ లో ప్రముఖ సిని నిర్మాత బోనీ కపూర్, మరొక నటుడు సంజయ్ కపూర్ లు నిర్మల కపూర్ తనయులు అన్న సంగతి తెలిసిందే. తల్లి మరణంతో మూడు అన్న దమ్ములు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిర్మల కపూర్ వయసు 90 సంవత్సరాలు. నిర్మల మరణానికి సంబంధించిన వార్తను మే 02 సాయంత్రం వెలువడింది. ఈ వార్తతో బాలీవుడ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె గత వారం రోజులుగా ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వృద్దాప్య సమస్యలతో చికిత్స పొందుతున్న నిర్మల కపూర్ ఈ రోజు ప్రపంచానికి వీడ్కోలు పలికింది.
తల్లితో ఉన్న చిత్రాలను పంచుకున్న అనిల్ కపూర్
గత సంవత్సరం సెప్టెంబర్ 27న ఆయన 90వ పుట్టినరోజు. ఆ సందర్భంగా అనిల్ కపూర్ తన తల్లితో కలిసి దిగిన అనేక ప్రత్యేక చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫోటోలలో అనిల్ తో పాటు సంజయ్, బోనీ కపూర్ కూడా కనిపించారు. కుటుంబం మొత్తం కలిసి చాలా సంతోషంగా కనిపించారు. ఈ చిత్రాలలో అనిల్ కపూర్ భార్య సునీత తన అత్తగారి పక్కన కూర్చుని ఉన్నారు. బోనీ కపూర్ శ్రీదేవిల కుమార్తె జాన్వీ కపూర్, సంజయ్ కపూర్ కుమార్తె షనాయ కూడా ఈ ఫోటోలలో ఉన్నారు.
View this post on Instagram
2011 లో అనిల్ కపూర్ తండ్రి మరణం
14 సంవత్సరాల క్రితం, బోనీ, అనిల్ , సంజయ్ కపూర్ తమ తండ్రిని కోల్పోయారు. 2011 సంవత్సరంలో అనిల్ తండ్రి సురీందర్ కపూర్ ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు. ఇప్పుడు ఆ ముగ్గురి అన్నదమ్ములు తమ తల్లిని కోల్పోయారు.
View this post on Instagram
సురీందర్ కపూర్ దక్షిణాది నుంచి బాలీవుడ్ కు వెళ్ళినప్పుడు ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. ఒకానొక సమయంలో ఒకప్పుడు సురీందర్ కపూర్ తన కుటుంబంతో కలిసి పృథ్వీరాజ్ కపూర్ గ్యారేజీలో నివసించేవాడు. సురీందర్ కపూర్, నిర్మల్ కపూర్ దంపతులు తమ పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వడానికి ఎంతో కష్టపడ్డారు. ఈ దంపతులు పిల్లలను ఎంత కేరింగ్ గా పెంచారంటే బాలీవుడ్ లో బోనీ, అనిల్, సంజయ్ కపూర్ ముగ్గురూ బాలీవుడ్ లో గొప్ప స్థానాల్లో ఉండడమే కాదు.. సోనమ్ కపూర్, అర్జున్ కపూర్, జాన్వి కపూర్ వంటి మూడో తరం కూడా సినిమాల్లో అడుగు పెట్టి తమదైన పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకుంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








