AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఆపరేషన్ సింధూర్‌కు సపోర్టుగా.. ఇండియన్ ఆర్మీకి ప్రముఖ నటుడి భారీ విరాళం.. ఏకంగా 100 శాతం..

పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ లోని ఉగ్రవాదులు, వారి స్థావరాలను మట్టు బెట్టింది. ఇప్పుడీ ఆపరేషన్ కు సపోర్టుగా ఓ ప్రముఖ నటుడు భారీ విరాళం అందజేశాడు.

Tollywood: ఆపరేషన్ సింధూర్‌కు సపోర్టుగా.. ఇండియన్ ఆర్మీకి ప్రముఖ నటుడి భారీ విరాళం.. ఏకంగా 100 శాతం..
Indian Army
Basha Shek
|

Updated on: May 30, 2025 | 10:12 AM

Share

ప్రముఖ బాలీవుడ్ నటుడు భువన్ బామ్ గొప్ప మనసును చాటుకున్నాడు. దేశభక్తికి చిహ్నంగా తన తాజా బ్రాండ్ ప్రమోషన్లపై వచ్చిన మొత్తం (100 శాతం) డబ్బును ఎన్టీఆర్ఎఫ్ (జాతీయర రక్షణ నిధి)కి విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించాడు. పాకిస్తాన్ పై భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమానికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నటుడు తెలిపారు. ప్రస్తుతం భువన్ ప్రకటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ నటుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భువన్ లాగే సినీ ప్రముఖులు, నటీ నటులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు స్వచ్ఛంధంగా ముందుకు రావాలని నెటిజన్లు కోరుతున్నారు. కమెడియన్ గా, నటుడిగా, రైటర్ గా, సింగర్ గా, యూట్యూబ్ పర్సనాలిటీగా భువన్ కు హిందీ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా తన యూట్యూబ్ ఛానెల్ బీబీకి వైన్స్ కు కోట్లాది మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. పలు టీవీ షోల్లోనూ, వెబ్ సిరీసుల్లోనూ, మ్యూజిక్ ఆల్బమ్స్ లోనూ మెరిశాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.

చూడ్డానికి హాలీవుడ్ హీరోలా కనిపించే భువన్ పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. యాడ్స్ లో నటిస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. ఈ క్రమంలోనే బ్రాండ్ ప్రమోషన్లపై వచ్చిన మొత్తం (100 శాతం) డబ్బును జాతీయర రక్షణ నిధి కి విరాళంగా అందించి గొప్ప మనసును చాటుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Bhuvan Bam (@bhuvan.bam22)

గతంలోనూ.. కాగా భువన్ విరాళాలు ప్రకటించడం ఇదేమీ మొదటి సారి కాదు.. గ తంలో కోవిడ్-19 మహమ్మారి సమయంలో PM CARES నిధి, CM రిలీఫ్ ఫండ్, ఫీడింగ్ ఇండియాకు రూ. 10 లక్షలు విరాళంగా ఇచ్చాడు. ఇక సామాజిక బాధ్యతగా వివిధ మంచి కార్యక్రమాలు, అవేర్ నెస్ క్యాంపెయిన్లలోనూ పార్టిసిపేట్ చేస్తున్నాడు.

View this post on Instagram

A post shared by Bhuvan Bam (@bhuvan.bam22)

ఇవి కూడా చదవండి..

OTT Movie: పౌర్ణమి రోజున రెచ్చిపోయే రక్త పిశాచి.. ఓటీటీలో ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్.. చిన్న పిల్లలు చూడొద్దు

Tollywood: 17 ఏళ్లకే సినిమాల్లోకి.. బిగ్ బాస్‌తో ఎనలేని క్రేజ్.. ఈ విజయవాడ బ్యూటీని గుర్తు పట్టారా?

Tollywood: ఏంటమ్మా ఇది! వోడ్కాకు బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. నెటిజన్ల ఆగ్రహం

Hari Hara Veera Mallu: పవన్ హరి హర వీరమల్లులో మెరిసిన టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్.. ఎవరో గుర్తు పట్టారా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.