Sandeep Reddy- Ram Charan: సందీప్ రెడ్డి వంగాకు రామ్ చరణ్ దంపతుల సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఏం పంపించారో తెలుసా?
ప్రస్తుతం భారతీయ సినిమా ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోన్న పేరు సందీప్ రెడ్డి వంగా. ఇటీవల స్పిరిట్ సినిమా నుంచి దీపిక పదుకొణెను తప్పించడంతో ఈ టాలీవుడ్ డైరెక్టర్ పేరు ఇప్పుడు మార్మోగుతోంది. ఇదిలా ఉంటే ఈ క్రేజీ డైరెక్టర్ కు రామ్ చరణ్ దంపతులు ఓ గిఫ్ట్ పంపించారు.

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుతం అతను పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా హీరోయిన్ ఎంపిక విషయం ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మొదట స్పిరిట్ లో దీపిక పదుకొణెను హీరోయిన్ గా నటిస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు త్రిప్తి డిమ్రీని అధికారికంగా ఎంపిక చేశారు. దీపికను తొలగించారా? లేక ఆమె తప్పుకుందా? అనే విషయంలో క్లారిటీ లేదు కానీ మొత్తానికి స్పిరిట్ సినిమాలో దీపిక లేదు. ఈ విషయంపై సందీప్ రెడ్డి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం, అలాగే దీనికి కౌంటర్ గా ఉండేలా దీపిక కూడా ఒక పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదం కొనసాగుతుండగానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు సందీప్ రెడ్డి వంగాకు ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపించారు. ఈ విషయాన్ని అతనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అంతేకాదు ఈ సందర్భంగా మెగా కపుల్ కు ధన్యవాదాలు కూడా తెలిపాడీ క్రేజీ డైరెక్టర్. ఇంతకీ సందీప్ కు రామ్ చరణ్ దంపతులు ఏం పంపించారో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి సతీమని సురేఖ, అలాగే మెగా కోడలు ఉపాసన కలిసి అత్తమ్మాస్ కిచెన్ పేరుతో పలు ఆహార ఉత్పత్తులు విక్రయిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆవకాయ పచ్చడిని కూడా అత్తమ్మాస్ కిచెన్ మెనూలో చేర్చారు. ఈ క్రమంలోనే సమ్మర్ లో స్పెషల్ గా పెట్టిన ఆవకాయ్ జాడీని సందీప్ రెడ్డికి పంపించారు రామ్ చరణ్ దంపతులు. ఇందుకు సంబంధించిన పొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు డైరెక్టర్. తనకు స్పెషల్ గిఫ్ట్ పంపించిన రామ్ చరణ్, ఉపాసనకు స్పెషల్ థాంక్స్ చెప్పాడు. ఆవకాయ టేస్ట్ కూడా చాలా బాగుందంటూ కితాబిచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
సందీప్ రెడ్డి వంగా ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి..
Tollywood: 17 ఏళ్లకే సినిమాల్లోకి.. బిగ్ బాస్‌తో ఎనలేని క్రేజ్.. ఈ విజయవాడ బ్యూటీని గుర్తు పట్టారా?
Tollywood: ఏంటమ్మా ఇది! వోడ్కాకు బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. నెటిజన్ల ఆగ్రహం
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.