AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishan Kumar: యానిమల్ నిర్మాత ఇంట్లో విషాదం.. 20 ఏళ్ల కూతురు మృతి.. అసలేం జరిగిందంటే..

ఈ విషయాన్ని జూలై 19న తీషా కుమార్ కుటుంబసభ్యులు తెలియజేయగా.. ఆమె మరణం పై ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలోని బడా నిర్మాణ సంస్థ అయిన టీ సిరీస్‏ను భూషణ్ కుమార్ చూసుకుంటున్నారు. ఆయనకు కృష్ణ కుమార్ చిన్నాన్న. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉన్న టీ సిరీస్ నిర్మాణ సంస్థలో కృష్ణ కుమార్ ఒక భాగం. ప్రస్తుతం ఈ సంస్థ చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు.

Krishan Kumar: యానిమల్ నిర్మాత ఇంట్లో విషాదం.. 20 ఏళ్ల కూతురు మృతి.. అసలేం జరిగిందంటే..
Tishaa Kumar
Rajitha Chanti
|

Updated on: Jul 19, 2024 | 5:07 PM

Share

బాలీవుడ్ నిర్మాత కృష్ణ కుమార్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. చాలా చిన్న వయసులోనే అంటే 20 ఏళ్ల వయసులోనే ఆయన ఏకైక కుమార్తె తీషా కుమార్ మరణించింది. కొన్నాళ్లుగా క్యా్న్సర్ సమస్యతో బాదపడుతున్న తీషా కుమార్‏ జూలై 18న చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచింది. ఈ విషయాన్ని జూలై 19న తీషా కుమార్ కుటుంబసభ్యులు తెలియజేయగా.. ఆమె మరణం పై ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలోని బడా నిర్మాణ సంస్థ అయిన టీ సిరీస్‏ను భూషణ్ కుమార్ చూసుకుంటున్నారు. ఆయనకు కృష్ణ కుమార్ చిన్నాన్న. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉన్న టీ సిరీస్ నిర్మాణ సంస్థలో కృష్ణ కుమార్ ఒక భాగం. ప్రస్తుతం ఈ సంస్థ చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు.

1995లో బేవఫా సనమ్ అనే సినిమాలో కీలకపాత్రలో నటించారు కృష్ణ కుమార్. ఆ తర్వాత నటుడిగా కాకుండా ప్రొడ్యూసర్‏గా ఉండిపోయారు. పూర్తిగా సినిమా నిర్మాణ వ్యవహారాలనే చూసుకుంటున్నారు. గతేడాది రణబీర్ కపూర్, డైరెక్టర్ సందీప్ రెడ్డి కాంబోలో వచ్చిన యానిమల్ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్ పై నిర్మించారు. టీ సిరీస్ నిర్మాణ సంస్థకు చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్న కృష్ణ కుమార్ కు ఏకైక కుమార్తె తీషా కుమార్. 6 సెప్టెంబర్ 2003న జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 20 సంవత్సరాలు.

కొన్నాళ్లుగా క్యాన్సర్ సమస్యతో పోరాడుతూ జర్మనీలో అత్యాధునిక చికిత్స తీసుకుంటుంది. కానీ ఆమెను వైద్యులు కాపాడలేకపోయారు. తీషా కుమార్ పార్థివదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిన్నవయసులోనే తమ ఏకైక కూతురు మృతి చెందడంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. తీషా కుమార్ మరణంపై టీ సిరీస్ బ్యానర్ ఓ ప్రకటన విడుదల చేసింది. కృష్ణ కుమార్ కుమార్తె తీషా క్యాన్సర్ సమస్యతో తుది శ్యాస విడిచిందని.. దయచేసి ఈ కష్ట సమయంలో గోప్యతను గౌరవించాలని ప్రకటించారు. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.