Amitabh Bachchan: గణేశుడికి బిగ్ బీ అమితాబ్ భారీ విరాళం.. తిడుతోన్న నెటిజన్లు.. కారణమిదే

గణపతి ఉత్సవాలకు మంబై నగరం బాగా ఫేమస్. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున గణేశ్ వేడుకల్లో పాల్గొంటారు. ఈ క్రమంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ లాల్‌బాగ్చా రాజా గణేశుడికి భారీ విరాళమిచ్చారు. అయితే కొందరు నెటిజన్లు బిగ్ బీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Amitabh Bachchan: గణేశుడికి బిగ్ బీ అమితాబ్ భారీ విరాళం.. తిడుతోన్న నెటిజన్లు.. కారణమిదే
Amitabh Bachchan

Updated on: Sep 06, 2025 | 8:55 PM

ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ముంబైలోని ప్రసిద్ధ గణపతి లాల్‌బాగ్చా రాజాకు రూ.11 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఆయన స్వయంగా వెళ్లి ఈ డబ్బు ఇవ్వలేదు, కానీ తన బృందంతో చెక్కును గణపతి మండపం నిర్వాహకులకు పంపించారు. లాల్‌బాగ్చా రాజా మండల్ కార్యదర్శి సుధీర్ సాల్వి చెక్కును స్వీకరించి విలేకరులకు పోజులిచ్చిన వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. లాల్‌బాగ్ రాజుకు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ రూ. 11 లక్షలు విరాళంగా ఇవ్వడాన్ని చాలా మంది ప్రశంసించారు. అయితే కొందరు మాత్రం బిగ్ బీపై తీవ్ర కోపంతో ఉన్నారు. భారీ వర్షాలు, వరదలతో పంజాబ్ బిక్కు బిక్కుమంటోంది. 1988 తర్వాత పంజాబ్ లో మళ్లీ ఈ స్థాయి వరదలు వచ్చాయి. సుమారు 1,300 కి పైగా గ్రామాలు మునిగిపోయాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం వ్యవసాయానికి అపారమైన నష్టం వాటిల్లింది. ఇప్పటికే దాదాపు 3 లక్షల ఎకరాల వరి, ఇతర పంటలు నీటిలో నాశనమయ్యాయి. మృతుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. దీంతో చాలా మంది సినీ ప్రముఖులు వరద బాధితులకు విరాళాలు అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బీ ఈ విరాళానికి బదులు పంజాబ్‌ వరద బాధితులకు సాయం చేయాల్సిందని అభిప్రాయ పడుతున్నారు.

‘ బిగ్ బీ గారు.. మీరు పంజాబ్ కోసం ఏదైనా చేసి ఉంటే మరింత ఆనందదాయకంగా ఉండేది’ అని చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. మతపరమైన కారణాల కోసం సెలబ్రిటీలు ఎల్లప్పుడూ విరాళాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారని కొంతమంది బిగ్ బీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘పంజాబ్‌కు సహాయం చేయండి ..దేవునికి సహాయం చేయడం వల్ల ఏమీ జరగదు..మానవాళికి సహాయం చేయండి’ అని మరో నెటిజన్ రియాక్ట్ అయ్యారు. ‘మీరు పంజాబ్‌కు విరాళం ఇచ్చి ఉన్నా లేదా ఒకటి లేదా రెండు కుటుంబాలను దత్తత తీసుకుని ఉంటే బాగుండేది సార్’ అని మరికొందరు స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరలవుతోన్న వీడియో ఇదే..

పంజాబ్ కు సాయం చేయడానికి డబ్బుల్లేవా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.