Alia Bhatt: రణబీర్ పై ట్రోలింగ్.. స్పందించిన అలియా భట్.. నా భర్త గురించి నాకు తెలుసంటూ..

తాజాగా అలాంటి వారికి అలాంటి వారికి అలియా భట్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. కొన్ని రోజుల క్రితం రణబీర్ కపూర్ పై సోషల్ మీడియాలో ట్రోల్ జరిగింది. రణబీర్ కపూర్ కు అలియా లిప్ స్టిక్ వేసుకోవడం ఇష్టముండదట.దీనికి 'టాక్సిక్' అని ట్యాగ్ చేస్తూ ట్రోల్ చేశారు కొందరు. ఇప్పుడు దీనిపై అలియా భట్ స్పందించింది. 'కాఫీ విత్ కరణ్' షోలో ఆలియా మాట్లాడుతూ.. తన భర్త గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Alia Bhatt: రణబీర్ పై ట్రోలింగ్.. స్పందించిన అలియా భట్.. నా భర్త గురించి నాకు తెలుసంటూ..
Ranbir Kapoor Alia Bhatt

Updated on: Nov 16, 2023 | 8:54 AM

బాలీవుడ్ లవ్లీ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్ సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఈ ఇద్దరూ మధ్య విభేదాలు అంటూ బాలీవుడ్ లో ఆ మధ్య గుసగుసలు వినిపించాయి. వీరి జీవితం గురించి ఇప్పటికే చాలా మంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా అలాంటి వారికి అలాంటి వారికి అలియా భట్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. కొన్ని రోజుల క్రితం రణబీర్ కపూర్ పై సోషల్ మీడియాలో ట్రోల్ జరిగింది. రణబీర్ కపూర్ కు అలియా లిప్ స్టిక్ వేసుకోవడం ఇష్టముండదట. దీనికి ‘టాక్సిక్’ అని ట్యాగ్ చేస్తూ ట్రోల్ చేశారు కొందరు. ఇప్పుడు దీనిపై అలియా భట్ స్పందించింది. ‘కాఫీ విత్ కరణ్’ షోలో ఆలియా మాట్లాడుతూ.. తన భర్త గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

కరణ్ జోహార్‌కి బాలీవుడ్‌లోని ప్రముఖులందరితోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. ‘కాఫీ విత్ కరణ్’ షోకి వచ్చిన అతిధులను పలు వ్యక్తిగత ప్రశ్నలు అడిగి ఇరకాటంలో పెడుతుంటారు కరణ్. కరణ్‌తో ఉన్న బంధం కారణంగా ఆ సెలబ్రిటీలు స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. రణ్‌బీర్ కపూర్‌ను ‘టాక్సిక్’ అని కామెంట్స్ చేయడం పై అలియా భట్ చాలా కాలంగా మౌనంగా ఉంది. అయితే ఇప్పుడు ఆమె మౌనం వీడింది. తన భర్త వ్యక్తిత్వం అలాంటిది కాదని చెప్పింది.

మేకప్‌కి సంబంధించిన వీడియోలో, అలియా భట్ కొన్ని అనుభవాలను పంచుకుంది. నేను లిప్ స్టిక్ వేసుకుంటే రణబీర్ కపూర్ ఇష్టపడడు. తుడిచిపెట్టేయండి అంటున్నారు’ అని ఆలియా తెలిపింది. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ ర‌ణ్‌బీర్ క‌పూర్ విష‌యాన్ని నెటిజ‌న్లు ట్రోల్ చేశారు.దీని పై అలియా మాట్లాడుతూ.. ‘ఇలా జరగడం నాకు బాధగా ఉంది. ఎందుకంటే రణబీర్ కపూర్ వ్యక్తిత్వం నాకు తెలుసు. నా మాటలు తప్పుగా అర్ధం చేసుకున్నారు. నా సహచరులు కూడా నాతో చెప్పారు. కానీ రణ్ బీర్ కపూర్ పై కథనాలు రాసారు. ప్రపంచంలో దృష్టి పెట్టాల్సిన ఇతర అంశాలు కూడా ఉన్నాయి’ అని అలియా భట్ తెలిపింది.

అలియా భట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.