Alia Bhatt: బాయ్‌కాట్‌పై మాటలతో మంటరేపిన అలియా భట్.. అంతమాట అనేసిందేంటి..!

మంటలు ఎగిసిపడుతున్నపుడు.. దాన్ని ఆర్పే ప్రయత్నం చేయాలి కానీ ముందు వెనక ఆలోచించకుండా ఆజ్యం మాత్రం పోయకూడదు. కానీ బాలీవుడ్‌లో కొందరు ఇదే చేస్తున్నారు.

Alia Bhatt: బాయ్‌కాట్‌పై మాటలతో మంటరేపిన అలియా భట్.. అంతమాట అనేసిందేంటి..!
Alia Bhatt
Follow us

|

Updated on: Aug 27, 2022 | 8:41 PM

మంటలు ఎగిసిపడుతున్నపుడు.. దాన్ని ఆర్పే ప్రయత్నం చేయాలి కానీ ముందు వెనక ఆలోచించకుండా ఆజ్యం మాత్రం పోయకూడదు. కానీ బాలీవుడ్‌లో కొందరు ఇదే చేస్తున్నారు. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి సీనియర్లు కూడా దీనిపై స్పందించకుండా ఉండిపోతే.. కొందరు జూనియర్లు మాత్రం తెలిసీ తెలియని కామెంట్స్‌తో మరింత రచ్చకు తెర లేపుతున్నారు. తాజాగా అలియా(Alia Bhatt) సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేసారు. బాలీవుడ్‌లో బాయ్ కాట్ ట్రెండ్ ఎలా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరణ్ జోహార్ నిర్మించారని లైగర్‌ను కూడా వదల్లేదు. అయితే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ దీన్ని ఎలాగోలా సద్దుమనిగేలా చేసారు. ఈ బాయ్ కాట్ ట్రెండ్‌పై బాలీవుడ్ సీనియర్స్ కూడా ఏం స్పందించట్లేదు. ఏం మాట్లాడితే అదెక్కడికి దారి తీస్తుందో అని అంతా కామ్‌గానే ఉన్నారు. కానీ అలియా భట్, కరీనా కపూర్, అర్జున్ కపూర్ లాంటి వాళ్ళు మాత్రం ఈ రచ్చను మరింత పెద్దగా మార్చేస్తున్నారు.

బ్రహ్మస్త్ర ప్రమోషన్స్‌లో భాగంగా అలియా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈమె వ్యాఖ్యలతో సినిమాను బ్యాన్ చేయాలంటూ ట్వీట్స్ మొదలయ్యాయి. నెపోటిజం, బాయ్ కాట్ గురించి అలియాను అడిగినపుడు.. సహనం కోల్పోయారు. ఫలానా కుటుంబంలో పుట్టాలని నేను కోరుకుని పుట్టానా? సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల్లో పుడితే.. తొలి సినిమా వరకే అది యూజ్ అవుతుంది.. ఆ కుటుంబంలోనే పుట్టడం తప్పంటే ఎలా.. నేను మీకు నచ్చకపోతే నన్ను చూడొద్దు.. దానికి నేనేమీ చేయలేనంటూ ఫైర్ అయ్యారు. మొన్న కరీనా కపూర్, అర్జున్ కపూర్ సైతం మీకు నచ్చకపోతే ఎవరు చూడమన్నారంటూ మండిపడ్డారు. అసలే సుశాంత్ మరణం తర్వాత స్టార్ కిడ్స్‌పై కోపంగా ఉన్న వాళ్ళకు.. ఈ కామెంట్స్ ఇంకా మంట పుట్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా తాజాగా అలియా చేసిన కామెంట్స్‌తో బ్రహ్మాస్త్రను పూర్తిగా బాయ్ కాట్ చేయాలంటూ ట్వీట్ల వర్షం కురుస్తుంది. సెప్టెంబర్ 9న విడుదల కానున్న ఈ చిత్రంపై అలియా కామెంట్స్ ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలిక.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..