మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఒక సినిమా టికెట్ కొంటె మరొక టికెట్ ఫ్రీ.. మరికొన్ని గంటల్లో ఆఫర్ క్లోజ్
ల్టీప్లెక్స్‌లలో టిక్కెట్ ధర ఎక్కువగా ఉండటంతో చాలా మంది సినిమాలు చూడటానికి వెనకాడుతున్నారు. అయితే వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్స్ ప్రకటించడం వల్ల ఆడియెన్స్ మల్టీప్లెక్స్ కు రావడం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారు. ఈ ఏడాది చాలా సినిమాలు ఈ స్ట్రాటజీని అనుసరించాయి. 'డ్రీమ్‌గర్ల్ 2', 'ది వ్యాక్సిన్ వార్', 'స్పైడర్ మ్యాన్', 'జవాన్' చిత్రాలు కూడా ఈ ఆఫర్‌ని ప్రకటించాయి.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇటీవల వరుసగా పరాజయాలు ఎదుర్కొంటున్నాడు. ఒకప్పుడు ఆయన నటించిన సినిమాలు మంచి బిజినెస్ చేసేవి. నెలకోసారి సినిమా రిలీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల అక్షయ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మిగులుతున్నాయి. సూర్య వంశీ తర్వాత ఈ స్టార్ హీరో నటించిన అరడజనకు పైగా సినిమాలు నిరాశపర్చాయి. ఇటీవలే అక్షయ్ నటించిన ‘మిషన్ రాణిగంజ్’ చిత్రం థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా కూడా పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోతోంది. అందుకే సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు డిఫరెంట్ స్ట్రాటజీ తీసుకుంటున్నారు మేకర్స్. ఇందులో భాగంగా ఇప్పుడు బై వన్ గెట్ వన్ ఫ్రీ టికెట్ అని ప్రకటించారు . దీని ద్వారానైనా ప్రేక్షకులు తమ సినిమా కు వస్తారన్నది చిత్రబృందం ఆశ. అక్టోబర్ 13న దేశవ్యాప్తంగా ‘జాతీయ సినిమా దినోత్సవం’ జరుపుకున్నారు. ఆ రోజు అన్ని సినిమాల టిక్కెట్టు ధరలు తగ్గాయి. దీని ఫలితంగా ‘మిషన్ రాణిగంజ్’ సినిమా 5 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది. దీంతో హ్యాపీగా ఉన్న చిత్ర బృందం ఇప్పుడు ‘బై వన్ గెట్ వన్ ఫ్రీ’ ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్ అక్టోబర్ 14, 15 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు ‘బుక్ మై షో’ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేస్తే మీకు ఈ ఆఫర్ లభిస్తుంది. దీంతో సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
యదార్థ సంఘటనల ఆధారంగా ‘మిషన్ రాణిగంజ్’ సినిమా తెరకెక్కింది. ఇంతకు ముందు అక్షయ్ కుమార్ ఇలాంటి కథలతో సినిమా చేసి విజయం సాధించాడు. అయితే ఇప్పుడు ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు. ‘మిషన్ రాణిగంజ్’ చిత్రం అక్టోబర్ 6న విడుదలైంది. 9 రోజుల తర్వాత కూడా ఈ సినిమా 18 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ నటుల సినిమాకు ఇది చాలా పేలవమైన కలెక్షన్. ‘బై వన్ గెట్ వన్ ఫ్రీ’ ఆఫర్ వల్ల ఈ సినిమా ఎంత వరకు లాభపడుతుందో త్వరలోనే తెలియనుంది. కాగా మల్టీప్లెక్స్‌లలో టిక్కెట్ ధర ఎక్కువగా ఉండటంతో చాలా మంది సినిమాలు చూడటానికి వెనుకాడుతున్నారు. ఆఫర్ ధరకు టికెట్ ఇస్తే.. అలాంటి వారు మల్టీప్లెక్స్ కు రావడం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారు. ఈ ఏడాది చాలా సినిమాలు ఈ స్ట్రాటజీని అనుసరించాయి. ‘డ్రీమ్‌గర్ల్ 2’, ‘ది వ్యాక్సిన్ వార్’, ‘స్పైడర్ మ్యాన్’, ‘జవాన్’ చిత్రాలు కూడా ఈ ఆఫర్‌ని ఇచ్చాయి. మరి ఈ బంపర్ ఆఫర్ మిషన్ రాణిగంజ్ వసూళ్లను ఏ మేర పెంచనుందో చూడాలి.
మిషన్ రాణిగంజ్ లో అక్షయ్ కుమార్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.