రష్మిక తొలి పారితోషికం ఎంతంటే.?

06 April 2025

Prudvi Battula 

ప్రస్తుతం దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్ మూవీస్‎లోనూ నటిస్తూ బిజీబిజీగా ఉంటోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.

ప్రస్తుతం ఈ అందాల తార చేతిలో కుబేర, ది గర్ల్ ఫ్రెండ్ అనే రెండు తెలుగు సినిమాలతో పాటు థామ అనే ఓ హిందీ హారర్ మూవీ ఉంది.

ప్రస్తుతం భారతీయ సినిమా ఇండస్ట్రీలో భారీ డిమాండ్ తో పాటు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో రష్మిక కూడా ఒకరు.

అయితే రష్మిక క్రేజ్ వెనక ఎన్నో కన్నీటి కష్టాలున్నాయి. ఆర్థిక సమస్యలతో తన ఫ్యామిలీ కొట్టుమిట్టాడందని ఆమె పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.

కాగా కన్నడలో కిర్రాక్ పార్టీ సినిమాతో వెండితెరకు పరిచయమైంది రష్మిక మందన్నా. ఇందులో ఆమె అందం, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి.

ఈ సినిమా తర్వాతనే రష్మికకు సినిమా అవకాశాలు బాగా పెరిగాయి. ఈ సినిమా కోసం ఆమె రూ.1.50 లక్షల పారితోషకం తీసుకుందట.

ఆ తర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఛలో సినిమాకు మాత్రం ఏకంగా రూ. 50 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందట రష్మిక.

ప్రస్తుతం సినిమాకు రూ. 5 కోట్లకు పైగానే తీసుకుంటోన్న నేషనల్ క్రష్ యానిమల్ రూ. 7 కోట్లు, పుష్ప 2 కోసం ఏకంగా 10 కోట్లు తీసుకుందట.