డీజే టిల్లుకి మొదటి ఎంపిక ఆ హీరోనే.. 

06 April 2025

Prudvi Battula 

డీజే టిల్లు సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. ఆ సినిమాకు సీక్వెల్‌గా గత ఏడాది వచ్చిన వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్టైంది.

ఈ మూవీ కలెక్షన్స్‌ను కుమ్మేసింది. దాంతో పాటే హీరో సిద్ధు జొన్నలగడ్డను స్టార్ బోయ్‌ను చేసింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి మార్కెట్ క్రియేట్ అయ్యేలా చేసింది.

మరి అలాంటి ఈ సినిమాలో... మొదట సిద్దు జొన్నలగడ్డను కాకుండా మరో హీరోను.. హీరోగా అనుకున్నారట తెలుసా..?

ఫస్ట్ పార్ట్ డీజే టిల్లు సినిమా మొదలెట్టినప్పుడు మొదట సిద్ధును కాకుండా... రౌడీ బాయ్‌ విజయ దేవరకొండను ఈ సినిమాకి హీరో అనుకున్నారట.

విజయ్‌కు ఈ స్టోరీని నరేట్ కూడా చేశారట.. కానీ అప్పటికే అర్జున్ రెడ్డి సినిమా చేసిన విజయ్‌.. ఆవెంటనే ఇలాంటి సినిమా ఎందుకని అనుకున్నారట.

దీంతో ఈ సినిమాకు తను సెట్ కాదంటూ పక్కకు తప్పుకున్నారట. దీంతో ఫస్ట్ పార్ట్ డైరెక్టర్ విమల్ కృష్ణ.. తన ఫ్రెండ్ అయిన సిద్దునే ఈ సినిమాలో హీరోగా ఫిక్స్ చేశారట.

ప్రొడ్యూసర్ నాగ వంశీ కూడా ఓకే అనడంతో.. ఆ సినిమా డీజె టిల్లుగా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్టైయింది. సిద్ధుని స్టార్ బోయ్‌గా టాలీవుడ్‌లో నిలబెట్టింది.

సిద్దు హీరోగా నటించిన జాక్ మూవీ ఈ నేల 10న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రొమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి.