Salman Dengue: సల్మాన్ ఖాన్‌కు డెంగ్యూ.. పరేషాన్‌తో పరుగులు తీసిన మున్సిపల్ అధికారులు.. ఆయన ఇంట్లోకి వెళ్లి మరీ..

|

Oct 27, 2022 | 7:00 PM

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు డెంగ్యూ నిర్ధారణ అవడం.. బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(BMC) అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.

Salman Dengue: సల్మాన్ ఖాన్‌కు డెంగ్యూ.. పరేషాన్‌తో పరుగులు తీసిన మున్సిపల్ అధికారులు.. ఆయన ఇంట్లోకి వెళ్లి మరీ..
Salman Khan Dengue
Follow us on

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు డెంగ్యూ నిర్ధారణ అవడం.. బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(BMC) అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. సల్మాన్‌ ఖాన్‌కు డెంగ్యూ నిర్ధారణ అయిన ఒక రోజు తరువాత అధికారులు.. ఉరుకులు పరుగులమీద దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో సల్మాన్ నివాసానికి చేరుకుని.. దోమలు ఎక్కడున్నాయా? అని సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టారు. దోమల వృద్ధికి కారణమైన ప్రదేశాలను గుర్తించి, ఆయా ప్రదేశాల్లో దోమల నివారణ మందును స్ప్రే చేశారు మున్సిపల్ అధికారులు.

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ ఇటీవల డెంగ్యూ నిర్ధారణ అయ్యింది. దీంతో అలర్ట్ అయిన బీఎంసీ అధికారులు.. సల్మాన్ నివసిస్తున్న ఏరియాలో ఎడిస్ దోమలు ఉన్నాయా? అనే సెర్చింగ్ మొదలు పెట్టారు. అధికారులు తనిఖీల్లో గెలాక్సీ అపార్ట్‌మెంట్ ప్రాంగణంలో ఏడిస్ దోమలు వృద్ధి చెందినట్లు గుర్తించారు. ‘‘గెలాక్సీ ప్రాంగణంలో రెండు ప్రదేశాలలో డెంగ్యూ లార్వా కనిపించింది. అయితే, ఖాన్ ఇంట్లో ఈ దోమలకు సంబంధించి ఎలా ఆనవాళ్లు కనిపించలేదు. అయినప్పటికీ దొమల నివారణకు ఉపయోగించే స్మోక్ డ్రైవ్ నిర్వహించాం. గెలాక్సీ పక్కన ఉన్న మరో ఆరు అపార్ట్‌మెంట్లలో దోమలు విపరీతంగా ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో వెంటనే దోమల నివారణ చర్యలు చేపట్టాలి. వారం రోజులు గడువు ఇస్తున్నాం. లేదంటే బాధ్యులైన అపార్ట్‌మెంట్ వాసులపై చర్యలు తీసుకుంటాం.’’ అని బీఎంసీ అధికారులు తెలిపారు. దోమల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

సల్మాన్ ఖాన్‌కు గత వారం డెంగ్యూ నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సల్లూభాయ్.. ఇప్పుడు పూర్తిగా కోలుకుంటున్నాడు. రేపో, ఎల్లుండో మళ్లీ కెమెరా ముందుకు వస్తాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సల్మాన్ ప్రస్తుతం ‘బిగ్ బాస్ 16’ షో హోస్ట్ చేస్తున్నారు. ఇంతలోనే ఆయనకు డెంగ్యూ రావడంతో ఆస్పత్రిలో చేరాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారని, త్వరలోనే షో షూటింగ్ తిరిగి స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు నిర్వాహకులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..