Sushant Singh Rajput: సుశాంత్ సింగ్‏తో బ్రేకప్ పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. తొలిసారి స్పందించిన అంకితా..

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అత్యంత ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ హీరో.. ఉన్నట్లుండి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం అతడి అభిమానులను షాక్‏కు గురి చేసింది. సుశాంత్ ఆత్మహత్య తర్వాత అతని ప్రియురాలు రియా చక్రవర్తి ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అలాగే కొన్ని నెలలపాటు జైలు జీవితం అనుభవించింది. రియా కంటే ముందు సుశాంత్ ప్రేమించిన అమ్మాయి అంకితా లోఖండే.

Sushant Singh Rajput: సుశాంత్ సింగ్‏తో బ్రేకప్ పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. తొలిసారి స్పందించిన అంకితా..
Ankita, Sushanth
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 01, 2023 | 4:31 PM

బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‏పుజ్ మరణం ఇప్పటికీ వీడని మిస్టరీ. అతను ఆత్మహత్య చేసుకుని నాలుగేళ్లు కావోస్తున్నా ఇప్పటికీ అతడి మరణంపై అనేక సందేహాలు వ్యక్తమవుతుంటాయి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అత్యంత ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ హీరో.. ఉన్నట్లుండి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం అతడి అభిమానులను షాక్‏కు గురి చేసింది. సుశాంత్ ఆత్మహత్య తర్వాత అతని ప్రియురాలు రియా చక్రవర్తి ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అలాగే కొన్ని నెలలపాటు జైలు జీవితం అనుభవించింది. రియా కంటే ముందు సుశాంత్ ప్రేమించిన అమ్మాయి అంకితా లోఖండే. బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ప్రస్తుతం బిగ్‎బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న అంకితా తొలిసారి సుశాంత్‏తో బ్రేకప్ గురించి మాట్లాడింది. అతడిని తాను ఎంతగానో ప్రేమించానని.. ఎదుటివాళ్ల మాటలు విని అతడు తన నుంచి విడిపోయి ఉంటాడని సందేహం వ్యక్తం చేసింది.

“నా జీవితం నుంచి సుశాంత్ ఆకస్మాత్తుగా విడిపోయి వెళ్లిపోయాడు. ఎందుకు బ్రేకప్ చెప్పాడనేది నాకు ఇప్పటికీ తెలియదు. అందుకు రీజన్ అడగాలని కూడా ఎప్పుడూ అనుకోలేదు. సుశాంత్ బ్రేకప్ తర్వాత నేను మరోకరిని ప్రేమించలేకపోయాను. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. మనం విజయాల నిచ్చెన ఎక్కుతున్నప్పుడు మనల్ని ప్రభావితం చేయడానికి పది మంది ప్రయత్నిస్తారు. మా ఇద్దరి మధ్య అప్పుడున్న పరిస్థితులలో ఏం జరిగిందనేది నాకు తెలియదు. అతడిని ఆపడానికి నేను ప్రయత్నించలేదు. తన నిర్ణయానికి గౌరవమిచ్చాను” అంటూ చెప్పుకొచ్చింది అంకిత. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. సుశాంత్, అంకిత 2016లో విడిపోయారు.

సుశాంత్ హీరోగా అడుగుపెట్టకముందు బుల్లితెరపై పలు సీరియల్స్ చేశాడు. 2009లో ఫేమస్ అయిన పవిత్ర రిష్ట సీరియల్లో హీరోగా కనిపించగా.. అంకిత అతడికి జోడిగా నటించింది. అప్పట్లో ఈ సీరియల్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సీరియల్ సమయంలో వీరిద్దరి ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత 2013లో కాయ్ పో చె సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు సుశాంత్. ఆ తర్వాత ఎంఎస్ ధోని సినిమాతో అతడి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ వెంటనే బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుని తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు సుశాంత్ . 2020 జూన్ 14న తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.