TOP 9 ET: హంగామాగా వరుణ్‌ పెళ్లి వేడుక | చంద్రబాబు రిలీజ్ పై NTR రియాక్షన్‌ ఏంటి..?

TOP 9 ET: హంగామాగా వరుణ్‌ పెళ్లి వేడుక | చంద్రబాబు రిలీజ్ పై NTR రియాక్షన్‌ ఏంటి..?

Anil kumar poka

|

Updated on: Nov 01, 2023 | 5:34 PM

ర‌క్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంట‌గా జంట‌గా హేమంత్ ఆర్ రావు తెరకెక్కించిన 'స‌ప్త‌సార‌గాలు దాటి' -'సైడ్ -ఏ'. ఈ సినిమాకు తెలుగులోనూ ప్రశంసలు వచ్చాయి. తాజాగా దీనికి సీక్వెల్ వస్తుంది. 'సప్త‌సాగ‌రాలు దాటి సైడ్ -బి'గా దీన్ని తీసుకొస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి లిరికల్ సాంగ్ విడుదలైంది. నువ్వే నువ్వే అంటూ సాగే ఈ పాట పూర్తిగా ఎమోషనల్‌గా సాగింది. పెళ్లి తర్వాత కూడా వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు హన్సిక.

01.Varunluv
వరుణ్‌లవ్‌ పెళ్లి వేడుక ఇటలీలో హంగామాగా జరుగుతోంది. మెగా ఫ్యామిలీలోని స్టార్స్ అందరూ.. తాజాగా జరిగిన కాక్‌ టెయిల్ పార్టీలో రచ్చ రచ్చ చేశారు. ఒకరినొకరు పలకరించుకుంటూ.. మాట్లాడుకుంటూ..వెరీగా హ్యాపీగా ఆ ఈవెంట్లో కనిపించారు. ఇక అందుకు సంబంధించిన ఫోటోలు బయటికి రావడంతో.. ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నారు.. వరుణ్‌లవ్‌కి పెళ్లిన స్టార్లు.

02.Chandra Bbau ntr
చంద్రబాబు అరెస్టుతో.. తెలుగు టూ స్టేట్స్‌ అట్టుడికి పోయినా కూడా.. తనకేం పట్టనట్టు తన పని తాను చేసుకుంటూ పోయారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. బాబు అరెస్ట్ పై రియాక్షన్ ప్లీజ్ అంటూ.. తెలుగు తమ్ముళ్లు అరిచిగీపెట్టినా కూడా.. సైలెంట్‌గానే ఉన్నారు. మరి అలాంటిది.. చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై.. బయటకు రావడం పై ఎన్టీఆర్ రియాక్షన్ ఏంటి? ఏమై ఉంటుందని.. తాజాగా తెలుగు తమ్ముళ్లు ఆరా తీస్తున్నారు. ఇప్పుడైనా తారక్‌ బయటికొచ్చి మాట్లాడాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.

03.Vikram
ఏజెంట్ సినిమాతో నిరాశపరిచిన దర్శకుడు సురేందర్ రెడ్డి నెక్ట్స్ మూవీకి రెడీ అవుతున్నారు. తాజాగా తమిళ హీరో విక్రమ్‌కు కథ వినిపించారు సురేందర్ రెడ్డి. యాక్షన్‌ థ్రిల్లర్ జానర్‌లో సిద్ధం చేసిన ఈ కథ బాగా నచ్చటంతో విక్రమ్ కూడా వెంటనే ఓకే చెప్పేశారు. అయితే ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసి సురేందర్ మూవీ సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి విక్రమ్‌కు రెండేళ్ల టైమ్ పడుతుందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

04.Animal
సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా వస్తున్న మూడో సినిమా యానిమల్. కంటెంట్ పరంగా ఇప్పటికే చాలా చూపించారు ఈ దర్శకుడు. తాజాగా రన్ టైమ్ పరంగానూ షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. ఈ సినిమాను ఏకంగా 3 గంటల 20 నిమిషాల నిడివితో తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అర్జున్ రెడ్డిని కూడా సందీప్ నాలుగు గంటలకు పైగానే ప్లాన్ చేసుకున్నారు.. కానీ చివరికి మూడు గంటలకు కుదించారు.

05.Ambajipeta
కలర్‌ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా నటిస్తున్న సినిమా అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్. దుశ్యంత్‌ కటికినేని ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రంలోని మొదటి పాట గుమ్మా విడుదలైంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం జనవరి 26, 2024న విడుదల కానున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు.

06. SSD
ర‌క్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంట‌గా జంట‌గా హేమంత్ ఆర్ రావు తెరకెక్కించిన ‘స‌ప్త‌సార‌గాలు దాటి’ -‘సైడ్ -ఏ’. ఈ సినిమాకు తెలుగులోనూ ప్రశంసలు వచ్చాయి. తాజాగా దీనికి సీక్వెల్ వస్తుంది. ‘సప్త‌సాగ‌రాలు దాటి సైడ్ -బి’గా దీన్ని తీసుకొస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి లిరికల్ సాంగ్ విడుదలైంది. నువ్వే నువ్వే అంటూ సాగే ఈ పాట పూర్తిగా ఎమోషనల్‌గా సాగింది.

07. Baby
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ జంటగా సాయి రాజేష్ తెరకెక్కించిన సెన్సేషనల్ లవ్ స్టోరీ బేబీ. ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అక్కడా సాయి రాజేష్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఓ ఫేమస్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ ఇందులో హీరోయిన్‌గా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

08.Guardian
పెళ్లి తర్వాత కూడా వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు హన్సిక. ఈమె ప్రస్తుతం గార్డియన్‌ అనే సినిమాలో నటిస్తున్నారు. విజయ్ చందర్ నిర్మాతగా వస్తున్న ఈ చిత్రానికి శబరి, గురు శరవణన్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హన్సిక గెటప్ చూస్తుంటేనే భయం కలుగుతుంది. ఇప్పటి వరకు ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసిన హన్సిక.. తాజాగా పర్ఫార్మెన్స్‌పై ఫోకస్ చేసారు.

09. Kangana
ఒక్క సక్సెస్‌ కూడా లేకపోయినా సౌత్‌ సినిమాతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నారు కంగనా రనౌత్‌. తలైవీ, చంద్రముఖి 2 సినిమాలు ఫ్లాప్ అయినా… మరో సౌత్ హీరోతో మూవీకి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో లీడ్ రోల్‌లో నటించబోతున్నారు ఈ బ్యూటీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..